Home » నాగబాబు వైఫ్ పద్మజా గురించి నమ్మలేని నిజాలు..!!

నాగబాబు వైఫ్ పద్మజా గురించి నమ్మలేని నిజాలు..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీలో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నారు నాగబాబు. చిరంజీవి,పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి పేరు ఉన్న వ్యక్తిగా నాగబాబు ఉన్నారని చెప్పవచ్చు. తన ఇద్దరు అన్నదమ్ములకు సపోర్టివ్ గా ఉంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అలాంటి నాగబాబు ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను తీశారు. ఈయన నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతీయడంతో ఇక సినిమాలు నిర్మించడం మానేసుకున్నారు. కానీ ఈమధ్య కాలంలోనే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాతో నిర్మాతగా మారారు.

also read:టైలర్ తప్పుగా ప్రవర్తిస్తే.. పల్సర్ బైకు ఝాన్సీ తండ్రి ఏమన్నాడో తెలుసా ? 

అయితే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కూతురు నిహారిక కూడా వెబ్ సిరీస్ నిర్మిస్తూ నిలదొక్కుకుంటుంది. నాగబాబు ఇంతటి ఘనత సాధించడం వెనుక ఉన్నది ఆయన భార్య పద్మజ.. 29 సంవత్సరాల వయసుకు పెళ్లి చేసుకున్నారు నాగబాబు. రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నారు. తన తల్లి అంజనదేవి పద్మజాను బంధువుల పెళ్లిలో చూసి ఎవరు ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుందట. పద్మజ పెళ్లికొడుకు తరఫున అమ్మాయి అయితే అంజనాదేవి పెళ్లికూతురు తరపున పెళ్ళికి వచ్చారట. ఇక పద్మజా గురించి అంజనాదేవి అన్ని విషయాలు తెలుసుకొని, అంతటి సాంప్రదాయం కలిగిన కుటుంబం వారు కాబట్టి కోడలిగా చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారట. అప్పటికే పద్మజా చిరంజీవికి అభిమాని..

also read:ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

ఈవిడే నాగబాబుకు భార్యగా రావడం చిరంజీవి కి కూడా నచ్చిందట. అప్పటికే ఆమె చిరంజీవి కి సంబంధించిన ఆల్బమ్స్, పేపర్ కటింగ్స్ అన్ని తయారు చేసుకుందట. వారి ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఆల్బమ్ చూపించేదట. అలా వారి ఇంటికి వెళ్ళిన అంజనాదేవికి కూడా అవన్నీ చూపించడంతో అంజనాదేవి మురిసిపోయి ఇక చేసుకుంటే పద్మజనే కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట. దీంతో నాగబాబు కు కూడా ఆ అమ్మాయి నచ్చింది. ఇంకేముంది పద్మజ నాగబాబుని పెళ్లి చేసేసుకుంది. పద్మజా ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. భర్త పిల్లలు కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఒక మంచి భార్యగా పేరు తెచ్చుకుంది.

also read:“బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?

Visitors Are Also Reading