Home » ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

by Sravanthi Pandrala Pandrala

కాస్ట్యూమ్ కృష్ణ అంటే నేటి తరానికి ఎక్కువగా తెలియకపోవచ్చు.కానీ నిన్నటి తరానికి బాగా పరిచయమున్న పేరు. విలక్షణమైన నటుడిగా చాలామందికి తెలుసు.నిర్మాతగా కూడా చాలామందికి పరిచయమయ్యారు. కానీ నిర్మాత అనే ట్యాగ్ లైన్ ఆయన కొంపముంచిందని చాలామంది అంటారు. పెళ్లి పందిరి మూవీ కాస్ట్యూమ్ కృష్ణ ని తీవ్రంగా నష్టపరిచింది. అప్పటివరకు ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆయన ఆర్థికంగా చతికిల పడ్డారు. చివరికి ఇదే చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. జగపతిబాబు హీరోగా పెళ్లి పందిరి మూవీ నిర్మించారు కాస్ట్యూమ్ కృష్ణ.

also read:చిరంజీవి, వెంకటేష్, నాగార్జున “గంగోత్రి” సినిమాకి ముందుగా అనుకున్న హీరోస్ ! అల్లు అర్జున్ చేతికి ఎలా వెళ్ళింది ?

కానీ ఈ చిత్రాన్ని పబ్లిసిటీ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే తన సినిమా ఆడుతుందని నమ్మారు. అయితే కాస్ట్యూమ్ కృష్ణకు తెలిసిన కొంతమంది మనుషులు మాత్రం ఈ నిర్ణయాన్ని విభేదించారు. కావాలంటే పబ్లిసిటీకి తాము రెండు లక్షల రూపాయలు ఇస్తామని, తమకు సంతకం పెడితే చాలని నమ్మించారు. ఈ ప్రతిపాదనను జగపతిబాబు కూడా ఓకే అన్నారట. దీంతో కృష్ణ రెండు డాక్యుమెంట్లపై రెండు సంతకాలు పెట్టారు. అందులో ఏముంది అనేది కూడా చదవలేదు. ఇదే ఆయన పాలిట శాపంగా మారింది.

also read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

ఆ రెండు డాక్యుమెంట్లలో రెండు లక్షల అప్పు ఇచ్చినట్టు ఉంది. అంతవరకు బాగానే ఉన్నా రెండో డాక్యుమెంట్లో మాత్రం పెళ్లి పందిరి నెగిటివ్ రైట్స్ అన్ని బయ్యర్లపరమైనట్టు ఉంది. దీనిపై కాస్ట్యూమ్ కృష్ణ సంతకం ఉంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆయన నమ్మిన వారే ద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే బాధలో ఆయన సినీ రంగాన్ని వదిలేసి ఆస్తులన్నీ అమ్మి తీసిన పెళ్లి పందిరి సినిమా తనకు దక్కకపోవడంతో చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ కు షిఫ్ట్ అయిపోయారు. తన సినీ జీవితాన్ని వదిలి శేష జీవితాన్ని గడుపుతూ వచ్చారు. తన సినీ కెరియర్లో ఎన్టీఆర్ చిరంజీవి ఏఎన్ఆర్ వంటి వాళ్ళ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. అంతేకాకుండా భారత్ బంద్ సినిమాతో నటుడిగా మారారు.

also read:టైలర్ తప్పుగా ప్రవర్తిస్తే.. పల్సర్ బైకు ఝాన్సీ తండ్రి ఏమన్నాడో తెలుసా ? 

Visitors Are Also Reading