Home » కుక్క కోసం విమాన టిక్కెట్లు డిమాండ్ చేసిన ర‌ష్మిక‌..!

కుక్క కోసం విమాన టిక్కెట్లు డిమాండ్ చేసిన ర‌ష్మిక‌..!

by Anji
Ad

హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ మ‌ధ్య ర‌ష్మిక తెగ వార్త‌ల్లో నిలిచింది. త‌న క్యూట్‌నెస్‌తో పాటు గ్లామ‌ర్ షోతో పాటు హాట్ టాఫిక్‌గా నిలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ప‌లు ఆప‌ర్ల‌ను అందిపుచ్చుకుంటుంది. ఈ అమ్ముడు తాజాగా త‌న పెట్ డాగ్ విష‌యంలో వార్త‌ల్లో నిలిచి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


నిర్మాత‌ల‌ను ఇటీవ‌ల హీరోయిన్లు ఎలా స‌తాయిస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎంత ఎక్కువ డిమాండ్ అంటే వారి కుయుక్తులు అంత ఎక్కువ‌గా ఉంటాయి. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ర‌ష్మిక త‌న సిబ్బందికి బిజినెస్ క్లాస్ టికెట్లు ఫైవ్ స్టార్ వ‌స‌తిని డిమాండ్ చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ర‌ష్మిక ఓ అడుగు ముందుకు వేసి త‌న పెంపుడు కుక్క కోసం విమాన టికెట్ల‌ను డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌ష్మిక త‌న పెట్ డాగ్ లేకుండా ఉండ‌నంటుంది. ఈ త‌రుణంలో ర‌ష్మిక తాను ఎటు వెళ్లిన పెట్ డాగ్ ఉండాలంటుంది. పెట్‌డాగ్ ఫ్లైట్ ఎక్కించే త‌రుణంలో ఖ‌ర్చు భారీగానే అవుతోంది. సాధార‌ణంగా నిర్మాత‌లు త‌క్కువ ధ‌ర‌కే విమానాల్లో టికెట్ల‌ను బుక్ చేయ‌డం ద్వారా డ‌బ్బు ఆదాచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఇప్పుడు పెంపుడు కుక్క ద్వారా లేనిపోని స‌మ‌స్య ఎదుర్కొంటున్నారు.

Advertisement

Advertisement

విమాన‌యాన సంస్థ‌లు పెంపుడు జంతువుల‌ను విమానంలో అనుమ‌తించ‌వు. దీని ద్వారా విమానాల టైమింగ్స్ త‌ద‌నుగుణంగా ఆమె షెడ్యూల్‌ను ప్లాన్ చేయ‌డం ప్ర‌తిదీ క‌ష్టంగా మారుతోంది. కానీ వారు స్టార్ హీరోయిన్‌తో పెట్ట‌కుంటే క‌ష్టాలు మామూలుగా ఉండ‌వు అని, అర్థ‌మ‌వుతుంది. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసిన ర‌ష్మిక త‌న కుక్క పిల్ల‌తో క‌నిపిస్తోంది. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ముంబ‌యి ఇలా ఎక్క‌డికి వెళ్లినా ఆమె మాత్రం త‌న కుక్క‌పిల్ల‌ను మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ఆ మ‌ధ్య ఛార్మి-ర‌ష్మిక క‌లిసి త‌మ కుక్క‌ల‌తో చేసిన హంగామా గురించి అంద‌రికీ తెలిసిందే. అదేవిధంగా న‌టి రాధిక‌, ర‌ష్మిక కూడా కుక్క‌పిల్ల‌ల‌తో దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక వ‌ద్ద ఉన్న పెట్ డాగ్ పేరు ఆరా. ర‌ష్మిక వ‌ద్ద‌కు ఈ ఆరా కుక్క‌పిల్ల ఎలా వ‌చ్చింద‌నేది తెలియాల్సి ఉంది.

Also Read : 

సింగ‌ర్ చిన్మ‌యి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

మీరు అర‌బిక్ కుతు అస‌లు డాన్స్ చూశారా..? చూడ‌కుంటే చూడండి

 

Visitors Are Also Reading