Home » మీరు అర‌బిక్ కుతు అస‌లు డాన్స్ చూశారా..? చూడ‌కుంటే చూడండి

మీరు అర‌బిక్ కుతు అస‌లు డాన్స్ చూశారా..? చూడ‌కుంటే చూడండి

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన యాక్ష‌న్ సీన్ల‌ను అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. ముఖ్యంగా వారి డ్యాన్స్ ని కూడా అంతే ఎక్కువ‌గా ఆదిరిస్తుంటారు. ఇదివ‌ర‌కు స్టార్ హీరోలు చేసిన డ్యాన్స్‌కి ఇప్పుడు చేస్తున్న ట్రెండ్ డ్యాన్స్‌కి మ‌ధ్య తేడా చాలా ఉంద‌నే చెప్పాలి. గ‌తంలో ఎంత మాస్ బీట్ సాంగ్ అయినా రిస్క్ లేకుండా సింపుల్ స్టెప్పుల‌తో డ్యాన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి డ్యాన్స్ కాలం అయిపోయింద‌నే చెప్పాలి. కేవ‌లం కాళ్లు, చేతులు ఊపుతూ చేసే డ్యాన్స్‌ని ప్ర‌స్తుతం కామెడీ చేస్తున్నారు.

Advertisement

ఈ త‌రుణంలో ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా వెరైటీ స్టెప్పుల‌తో డ్యాన్స్ లో కొత్త ర‌కం విన్యాసాలు చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. కొంద‌రూ కెరీర్ ప్రారంభం నుంచి డ్యాన్స్‌కి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న‌టువంటి ద‌క్షిణాది స్టార్ హీరోల్లో విజ‌య్ ద‌ళ‌పతి ఒక‌రు. ఆయ‌న కోలీవుడ్ తిరుగులేని స్టార్ అయినప్ప‌టికీ ప‌లు సినిమాలు, పాట‌ల కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఇటీవ‌లే బీస్ట్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ ఆ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. బీస్ట్ మూవీలో అర‌బిక్ కుత్తు సాంగ్ ఏ స్థాయిలో సోష‌ల్ మీడియాను షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

Advertisement


త‌మిళ అర‌బిక్ కుత్తు లిరిక‌ల్ పాట‌నే 430 మిలియ‌న్స్ పైగా వ్యూస్ రాబ‌ట్ట‌గా.. ఇటీవ‌లే విడుద‌లైన ఫుల్ వీడియో సాంగ్ 113 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాట‌లో విజ‌య్‌, పూజాహెగ్దే డ్యాన్స్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ర్షించింద‌నే చెప్పాలి. ఇదే పాట‌లో విజ‌య్ చేసిన ఓ స్టెప్ పై ప‌లు విమ‌ర్శ‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం. అర‌బిక్ కుత్తు వీడియో సాంగ్ విజ‌య్ ఓ క‌ర్ర‌ను ప‌ట్టుకొని వేసే స్టెప్పు ఒరిజిన‌ల్ వెర్ష‌న్ చేయ‌లేదు అని.. విజ‌య్ మార్చేసి మాయ చేసాడ‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. విజ‌య్ ఆ స్టెప్పులో ఏం మార్పులు చేశాడ‌ని ఆరా తీస్తే.. ఆ స్టెప్పులో కొరియోగ్రాఫ‌ర్ పాదాలు పైకి లేవ‌కుండా స్టెప్పులేశాడు. అదే స్టెప్ విజ‌య్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసరికి రెండు కాళ్లు గాల్లో లేపుతూ ఆ స్టెప్పులో మిస్ చేసాడ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అర‌బిక్ కుత్తు విజ‌య్ స్టెప్పుల‌పై మీ అభిప్రాయాల‌ను పంచుకోండి.

Also Read : 

సమంత, నాగ చైతన్య బాటలో ఆ స్టార్ కపుల్ ? హేమ చంద్ర – శ్రావణ భార్గవిల విడాకుల వార్తలు…! నిజమేనా ?

రామ్ గోపాల్ వర్మ పై రాజాసింగ్ ఫైర్…వేస్ట్ ఫెలో అంటూ దారుణమైన కామెంట్స్….!

 

Visitors Are Also Reading