Home » సింగ‌ర్ చిన్మ‌యి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

సింగ‌ర్ చిన్మ‌యి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

by Anji
Ad

ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద మ‌రొక మారు వార్త‌ల్లో నిలిచారు. కొంద‌రూ వ్య‌క్తులు త‌మ ప్రయివేటు పార్ట్‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ఖాతాకు పంపార‌ని.. వాటిపై ఫిర్యాదు చేస్తే త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సస్పెండ్ చేసిన‌ట్టు చిన్మ‌యి వెల్ల‌డించారు. చిన్మ‌యి శ్రీ‌పాద త‌మ డీఎంలు బ్లాక్ చేసిన తరువాత దీనిని గ‌మ‌నించారు. ఆమె ఒక బ్యాక‌ప్ ఖాతాను సృష్టించింది. దాని ద్వారా ఆమె చాలా కాలం నుంచి త‌న కంటెంట్‌ను పోస్ట్ చేయ‌డం ప్రారంభించింది.

Advertisement

సోష‌ల్ మీడియా వ్యాపారాలు స్ప‌ష్టంగా, విభిన్నంగా ప‌ని చేస్తాయి. పాల‌సీల పేరుతో ఆశ్చ‌ర్య‌కర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటాయి. ప్ర‌ముఖ న‌టీమ‌ణుల‌కు ముఖ్యంగా స‌మంతా రూత్ ప్ర‌భుకు వాయిస్ అందించ‌డంలో ప్ర‌సిద్ధి చెందిన గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద‌ను మ‌నం న‌మ్మాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఆమె ప్ర‌స్తుత ప‌రిస్థితిలో తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌స్తుతం బ్యాక‌ప్ అకౌంట్ ద్వారా త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను చిన్మ‌యి షేర్ చేసుకుంటుంది. ఈ విష‌యం గురించి చిన్మ‌యి కాస్త క్లారిటీ ఇచ్చింది.

Advertisement


కొంద‌రూ వ్య‌క్తులు వారికి సంబంధించిన అభ్యంత‌ర ఫోటోలు నాకు డైరెక్ట్‌గా పంపించారు. నేను పోస్టులు షేర్ చేసుకునే చోట కొంత‌కాలంగా ఇలా చోటు చేసుకుంటుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ య‌జ‌మాన్యానికి ఫిర్యాదు చేసాను. వారిపై ఫిర్యాదు చేయ‌డంతో ఇన్‌స్ట్రామ్ నా ఖాతాను నిలిపేసింది. నా యాక్సెస్ నిలిపేశార‌ని.. ఇది అలా జ‌రిగింది అంతే.. ప్ర‌స్తుతానికి నా బ్యాక‌ప్ అకౌంట్ chinmayi.sripada అటూ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది చిన్మ‌యి. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ చురుకుగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేకంగా mee Too Movement త‌మిళ ఇండస్ట్రీలో స్త్రీల‌ను దోపిడికి గురి చేసే బాలిక‌ల ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే ప‌లువురు పెద్ద‌ల పేర్లు తెర‌పైకి తీసుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

Also Read : 

నరేష్ తో నాలుగవ పెళ్లిపై వార్త‌లు వస్తున్న సమయంలో ..! పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి అలా చెప్పారా ?

మీరు అర‌బిక్ కుతు అస‌లు డాన్స్ చూశారా..? చూడ‌కుంటే చూడండి

 

Visitors Are Also Reading