Home » కోపంతో ఫోన్ ని విసిరేసిన రణ్ బీర్.. ఎందుకో తెలుసా ? 

కోపంతో ఫోన్ ని విసిరేసిన రణ్ బీర్.. ఎందుకో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా ఏదైనా సందర్భంలో సెలబ్రిటీలు తమకు ఎదురైతే వారితో సెల్పీ దిగాలని ఎవరైనా కలలు కంటుంటారు. కొందరూ అభిమానులు తమకు నచ్చిన హీరో, హీరోయిన్ వస్తున్నారంటే కేవలం వారిని చూడడానికి ఏ పని ఉన్నా దానిని పక్కన పెట్టి వారిని చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వారిని కలిసిన తరువాత సెల్పీ దిగడం సర్వసాధారణమే. తాజాగా ఓ అభిమాని సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఫోన్ ని విసిరేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలియకపోవడంతో ఆ వీడియో పై నెటిజన్లు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఓ అభిమాని అప్పటికే ఒకసారి సెల్పీ తీసుకున్నాడు. మళ్లీ మరోసారి సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిపై రణ్ బీర్ కపూర్ కోపపడ్డారు. ఏకంగా ఆ వ్యక్తి యొక్క ఫోన్ ని చాలా దూరంగా విసిరేశాడు. ఫస్ట్ ఆ అభిమాని అడగ్గానే నవ్వుతూ పోజులిచ్చాడు రణ్ బీర్. ఫోటో సరిగ్గా రాకపోవడంతో రెండోసారి సెల్పీ తీసేందుకు ప్రయత్నించాడు అభిమాని. దీంతో రణ్ బీర్ కోపం వచ్చి.. ఫోన్ చూస్తానని అడిగి ఫోన్ తీసుకొని విసిరేసాడు. 

Advertisement

Also Read :   ఈ 8 మంది సెల‌బ్రెటీల బాడీగార్డులు సంవ‌త్స‌రానికి ఎన్నికోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

ఈ విషయాన్ని అంతా ఓ వ్యక్తి  వీడియో తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జరిగిన దానిని చూసిన అభిమానులు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన ఏదైనా ఫోన్ బ్రాండ్ ప్రచారానికి సంబంధించింది కావచ్చని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ రణ్ బీర్ అసలు అలాంటి వాడు కాదని.. ఆ వీడియోని నమ్మవద్దని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ అయితే ఇది సరైన పద్దతి కాదు అని ట్వీట్ చేస్తున్నారు. ఈ విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ వస్తే కానీ అసలు విషయం తెలియదు. 

Also Read :  Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ప్రోమో చూశారా..?

Visitors Are Also Reading