సెలబ్రిటీలు బయటకు వెళ్తే సెల్ఫీల కోసం వారితో మాట్లాడటం కోసం జనాలు ఎగడతారు. కాబట్టి వారికి ఎంతో సెక్యూరిటీ అవసరం. ముఖ్యంగా స్టార్ హీరోలు హీరోయిన్ లకు సెక్యూరిటీ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే బయట అడుగు కూడా పెట్టలేరు. కాబట్టి స్టార్ హీరోలు హీరోయిన్ లు తమ భద్రత కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఇక కొందరు హీరో హీరోయిన్ లు తమ బాడీగార్డ్ లకు ఇస్తున్న జీతాల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షేరా కు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన బాడీగార్డ్ షిండేకు ఏడాదికి కోటిన్నర రూపాయలు ఇస్తారని సమాచారం. తన బాడీగార్డ్ కు ఏడాదికి 1.2 కోట్లు ఇస్తాడని తెలుస్తోంది.
Advertisement
అదేవిధంగా షారుక్ ఖాన్ సైతం తన బాడీగార్డ్ కు అధిక మొత్తంలో చెల్లిస్తున్నాడు. షారుక్ తన బాడీగార్డ్ రవి సింగ్ కు సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన బాడీ గార్డ్ యువరాజ్ కు సంవత్సరానికి కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాడు.
అదేవిధంగా బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన బాడీగార్డ్ కు ఏడాదికి 1.2 కోట్ల జీతం ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన బాడీగార్డ్ కు ఏడాదికి 1.2 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే సైతం తన బాడీగార్డ్ జలాల్ కు సంవత్సరానికి రూ. 80 లక్షలు చెల్లిస్తోంది. హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా తన బాడీగార్డ్ కు భారీగానే ఖర్చు చేస్తోంది. కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం రూ.1 కోటి ఖర్చు చేస్తుంది.
Advertisement
AlSO READ : రాజకీయాల్లో కృష్ణకు, జమునకు ఉన్న పోలిక తెలుసా ?