Home » బాహుబలిలో నటించడానికి రమ్యకృష్ణ అన్ని షరతులు పెట్టారా? వీటికి రాజమౌళి ఓకే చెప్పారా?

బాహుబలిలో నటించడానికి రమ్యకృష్ణ అన్ని షరతులు పెట్టారా? వీటికి రాజమౌళి ఓకే చెప్పారా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రమ్యకృష్ణ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రధాన పాత్రధారిగా చాలా సినిమాలలో నటించింది. వీటన్నిటిలో ది బెస్ట్ సినిమాలు అంటే మాత్రం బాహుబలి, నరసింహ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. అయితే, ఈ సినిమాలు రమ్యకృష్ణకి మంచి నటిగా పేరు తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా.. కమర్షియల్ గా కూడా మంచి విజయాలను పొందాయి. తాజాగా జైలర్ సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

Advertisement

నరసింహ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా అని ఆలోచించలేదని, రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో భాగం అవ్వాలని మాత్రమే అనుకున్నానని రమ్యకృష్ణ అన్నారు. ఆ సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న టెన్షన్ ఉండేదన్నారు. అలాగే.. బాహుబలి సినిమా మరో హిట్ ను తెచ్చిపెట్టిందని, ఆ సినిమాతో ఆ స్థాయిలో పేరు వస్తుందని అనుకోలేదన్నారు.

Advertisement

ఈ సినిమాలో నటించడానికి కొన్ని కండిషన్స్ పెట్టానని రమ్యకృష్ణ తెలిపారు. రాత్రి పూట్ల షూటింగ్ చేయనని చెప్పానని, అలాగే షూటింగ్ కోసం కేవలం కొన్ని రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వగలనని చెప్పానన్నారు. అయితే.. ఈ కండిషన్స్ కి రాజమౌళి గారు కూడా ఒప్పుకున్నారని.. నిజంగా శివగామి పాత్ర పెద్ద హిట్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. జైలర్ సినిమా గురించి మాట్లాడుతూ.. రజనీకాంత్, చిరంజీవిలు స్క్రీన్ పై కనిపిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరిన్ని..

రజినీకాంత్ వైసీపీ నేతలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading