Home » Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

by Mounika
Ad

Suryakantham and chayadevi : ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు వస్తూ వెళుతూ ఉంటారు. కానీ ప్రేక్షకులలో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. వారి సహజమైన నటనతో వీరు నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటారు అనే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సినిమాలలో గయ్యాళి అత్తలు , పోట్లాటకు కాలు దువ్వే వ్యక్తులు అని అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు సూర్యకాంతం, ఛాయాదేవి.ఛాయాదేవి, సూర్యకాంతం తెలుగు చిత్రసీమలో లెజెండరీ నటీమణులుగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Advertisement

వీరిద్దరూ అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో నాన్‌వెజ్‌ను ఎప్పుడూ ముట్టుకోలేదు. ఛాయాదేవి సినిమా రంగంలోకి అడుగుపెట్టి పౌరాణిక చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మాయాబజార్ చిత్రంలో బలరాముని భార్యగా నటించారు. ఇందులో సూర్యకాంతం కూడా ఘటోత్కచుడుగా వేషధారణలో ఉన్న ఎస్వీ రంగారావు తల్లి పాత్రను పోషించారు. నిజానికి వీరి ఇద్దరి మధ్య వయసు తేడా 12 ఏళ్లు.

సూర్యకాంతానికి ఛాయాదేవి కంటే తక్కువ అనుభవం ఉన్నా కూడా ఛాయాదేవితో పోటీ పడి ఆమె ప్రతి షాట్‌ను ఒక టేక్‌లో పూర్తి చేసేవారట. ఇది తరువాతి కాలంలో ఆమెకు బాగా ఉపయోగపడింది. మాయాబజార్ (1958) సినిమా విడుదల సమయంలో, సూర్యకాంతం సినీ పరిశ్రమకు చాలా కొత్త. అంతేకాదు సూర్యకాంతం రంగారావు కంటే 12 ఏళ్లు చిన్నది. దర్శకుడు కేవీ రెడ్డి ఈ పాత్రలో సూర్యకాంతం మాత్రమే నటించాలని పట్టుబట్టారు. అంతగా అనుభవం లేకపోయినా సూర్యకాంతం ఆ పాత్రను పోషించారు. కేవలం నాలుగు సన్నివేశాల్లోనే నటించి రెండు డైలాగులు పలికిన ఆమె ఆ రెండు డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

విమర్శకులు కూడా ఆమె నటనను మెచ్చుకున్నారు. ఛాయాదేవి తనకంటే తక్కువ ఏమి కాదు, ఏ కష్టమైన సన్నివేశాన్ని అయినా సింగిల్ టేక్‌లో చేస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఛాయాదేవి మరియు సూర్యకాంతం ఇద్దరూ ఒకరినొకరు సవాలు చేసుకుని తమ జీవితకాలంలో మరపురాని పాత్రలు ఎన్నో పోషించిన ప్రతిభావంతులైన నటీమణులు. వీరిద్దరూ జీవితాంతం తెలుగు సినిమాకు ఎంతో సేవ చేశారు. వీరిద్దరూ ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు.

కాకపోతే సూర్యకాంతం కోడల్ని రాచి రంపనపెట్టె అత్త పాత్రలో ఎక్కువగా నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. సూర్యకాంతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 1000కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో వదినగా, అత్తగా, తోటి కోడలుగా తన వ్యంగ్యమైన సూటిపోటి మాటలతో అందరినీ ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ లో సూర్యకాంతం జీవించారని చెప్పుకోవాలి. సూర్యకాంతం మరియు ఛాయాదేవి ఎన్నో చిత్రాలలో వదిన మరదలుగా కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

డాడీలో నటించిన ఆ చిన్నారి.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

“కేవలం వారే కారణం అంటూ కాస్టింగ్ కౌచ్ ” గురించి మొదటిసారిగా స్పందించిన సీనియర్ హీరోయిన్ జయప్రద..!

Visitors Are Also Reading