Home » రమ్యకృష్ణ ఆ హీరోతో ఘాటు ప్రేమ..కానీ చివరికి..!!

రమ్యకృష్ణ ఆ హీరోతో ఘాటు ప్రేమ..కానీ చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ ఇండస్ట్రీలో చూసినా ఒక హీరో హీరోయిన్ కలిసి కాస్త సన్నిహితంగా ఉన్నారంటే చాలు వారి మధ్య ఏదో ఉందని అనేక వార్తలు రాస్తూ ఉంటారు.. ఈ తంతు దశాబ్దాల కాలం నుంచే ఉంది . కానీ కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి రూమర్స్ ని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతారు. కానీ సున్నిత మనస్తత్వం ఉన్న సెలబ్రిటీలు మాత్రం చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. ముఖ్యంగా టాప్ లీడింగ్ హీరోయిన్స్ విషయంలో అయితే ఇలాంటి రూమర్స్ అనేవి సర్వసాధారణం. అలా ప్రముఖ టాప్ హీరోయిన్ రమ్యకృష్ణ పై ఆ రోజుల్లో చాలా రూమర్స్ వచ్చేవట.

also read:నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

Advertisement

రమ్యకృష్ణ టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసింది. ముఖ్యంగా ఈమె అక్కినేని నాగార్జునతో కొన్ని సినిమాల్లో నటించింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు సుమారుగా 10 సినిమాలకు పైగా వచ్చి ఉంటాయి. వాటిల్లో అధిక శాతం సూపర్ హిట్ సాధించినవే. ఒకటి రెండు సినిమాలు చేస్తేనే వారి మధ్య ఏదో నడుస్తుందని లింకు పెట్టేస్తారు. ఈ తరుణంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న నాగార్జున మరియు రమ్యకృష్ణ మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.

Advertisement

also read:దాస్ కా ధమ్కీని ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వెనుక దాగి ఉన్న కథ అదేనా ?

వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని , త్వరలో నాగార్జున అమలకు విడాకులు ఇచ్చేసి రమ్యకృష్ణని పెళ్లాడుతున్నారని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా అనేక వార్తలు రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారట. అయితే ఈ రూమర్ పై అటు రమ్యకృష్ణ గాని ఇటు నాగార్జున గాని రెస్పాన్స్ అవ్వలేదట. ఆ తర్వాత 2003 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని రమ్యకృష్ణ పెళ్లి చేసుకోవడంతో ఈ రూమర్లన్నింటికీ చెక్ పడింది.

also read:డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి ల‌వ్ స్టోరీకి అడ్డుప‌డిన దిల్ రాజు…ఎందుకో తెలుసా.?

Visitors Are Also Reading