Home » నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

by Bunty
Ad

నిరుద్యోగులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 68 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, టెలి కమ్యూనికేషన్, ట్రాక్షన్, ఈసీఎస్, డిపో మెషినరీ, ఆపరేషన్ సేఫ్టీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

READ ALSO : మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో ఏప్రిల్ 17, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Advertisement

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Bengaluru's Namma Metro services resumed after BMRCL, Karnataka security officials talk

అర్హత సాధించిన వారికి ఈ క్రింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు. జీతభత్యాల వివరాలు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ.1.4 లక్షలు జీతంగా చెల్లిస్తారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ. 85000 జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ.65000 జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ.50,000 జీతంగా చెల్లిస్తారు.

READ ALSO : అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిపోయిన అడవి శేష్!

Visitors Are Also Reading