Telugu News » Blog » రామ్‌చ‌ర‌ణ్ ఆ స‌మ‌యంలో ఏడ్చేశాడంట‌.. ఎందుకంటే..?

రామ్‌చ‌ర‌ణ్ ఆ స‌మ‌యంలో ఏడ్చేశాడంట‌.. ఎందుకంటే..?

by Anji
Ads

మెగా అభిమానుల‌తో పాటు ఇత‌ర సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఆతృత‌తో ఎదురుచూస్తున్న చిత్రం ఆచార్య‌. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లవుతోంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ చిత్ర ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేస్తున్నారు. కొర‌టాల శివ‌, రామ్‌చ‌ర‌ణ్ తేజ తాజాగా ఈ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 23న హైద‌రాబాద్‌లోని యూసూఫ్‌గూడ పోలీస్ స్టేష‌న్ మైదానంలో భారీ ఎత్తున నిర్వ‌హించ‌నున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ప‌లు విశేషాల‌ను హీరో రామ్‌చ‌ర‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తాను తన తండ్రితో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్ప‌లేమ‌ని వివ‌రించారు. ఆచార్య సినిమాలో త‌న తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం ల‌భించ‌డం ఎంతో ఆనందంగా ఉన్న‌ద‌ని చ‌ర‌ణ్ చెప్పారు. ఈ మూవీ చాలా అద్భుతంగా తెర‌కెక్కించార‌ని.. అందుకు ద‌ర్శ‌కుడు కొరటాల శివ‌కు ప్ర‌త్యేక థ్యాంక్స్ చెబుతున్నానని చ‌ర‌ణ్ అన్నారు.

సినిమాకు వేసిన షూటింగ్ సెట్ నుంచి కాటేజ్ కు ప్ర‌తిరోజు వెళ్లి రావాల‌ని చ‌ర‌ణ్ తెలిపారు. కాటేజ్ లోనే తాము భోజ‌నం చేసే వార‌మ‌ని.. కారును కూడా తానే స్వ‌యంగా డ్రైవ్ చేసే వాడిన‌ని చెప్పారు. ఒక‌ద‌శ‌లో త‌న తండ్రితో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌న్న అనుభూతి రాగానే త‌న‌కు ఆనంద భాష్పాలు వ‌చ్చేవి అని.. ఏమి చేయాలో తెలియ‌క ఏడ్చేసాన‌ని రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా త‌న తండ్రిని కౌగిలించుకునే వాడిన‌ని చ‌రణ్ తెలిపారు. ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అగ్ర‌ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్యఅతిథులుగా హాజ‌ర‌వ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

  1. Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శ్ర‌మిస్తే ఫ‌లితం ఉంటుంది
  2. కాజ‌ల్‌-గౌత‌మ్ కిచ్లు కొడుకు పేరు ఏమిటో తెలుసా..?
  3. మట్టిలో మాణిక్యం దివ్యజ్యోతికి సజ్జన్నార్ బంపరాఫర్..!

You may also like