Telugu News » Blog » కాజ‌ల్‌-గౌత‌మ్ కిచ్లు కొడుకు పేరు ఏమిటో తెలుసా..?

కాజ‌ల్‌-గౌత‌మ్ కిచ్లు కొడుకు పేరు ఏమిటో తెలుసా..?

by Anji
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన కాజ‌ల్ అగ‌ర్వాల్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. దాదాపు ద‌శాబ్ధంన్న‌ర కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగింది కాజ‌ల్‌. దాదాపు ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించింది అందాల ఈ భామ.

ఇదిలా ఉండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మినిచ్చిన విష‌యం తెలిసిన‌దే. ఏప్రిల్ 19న కాజ‌ల్ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లు, చెల్లెలు నిషా అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. తాజాగా గౌత‌మ్ కిచ్లు త‌న కుమారుడి పేరు నీల్ కిచ్లు అని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా నెటిజ‌న్ల‌తో పంచుకున్నాడు. వెంట‌నే అది చూసిన నెటిజ‌న్లు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చాలా బాగుంద‌ని కామెంట్ చేస్తున్నారు.


కాజ‌ల్ గ‌త సంవ‌త్స‌రం ప్రెగ్నెంట్ అని సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ కొన‌సాగిన విష‌యం తెలిసిన‌దే. అయితే కాజ‌ల్ అప్పుడు స్పందించ‌లేదు. జ‌న‌వ‌రిలో త‌ను ప్రెగ్నెంట్ అని బేబి బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది కాజ‌ల్‌. ఇక కాజ‌ల్ న‌టించిన సినిమాల విష‌యానికొస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య సినిమాలో న‌టించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల‌వ్వ‌నుంది. దీనితో పాటు హిందీలో రెండు సినిమాలు, త‌మిళంలో ఓ సినిమాలో న‌టించింది. కాజ‌ల్ ఈ మూడు చిత్రాల‌లో షూటింగ్ పూర్తి చేసుకోవ‌డంతో పాటు ఆ సినిమాలు విడుద‌ల‌కు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :

  1.  హైద‌రాబాద్‌లో నోరో వైర‌స్ క‌ల‌క‌లం.. చిన్న పిల్ల‌లు జాగ్ర‌త్త‌..!
  2. నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!
  3. కేజీఎఫ్ ఎఫెక్ట్‌.. వైర‌ల్‌ అవుతున్న వెడ్డింగ్ కార్డుపై వ‌య‌లెన్స్ డైలాగ్..!

You may also like