Home » Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

by Bunty
Ad

టాలీవుడ్‌ స్టార్‌ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఈ స్టార్‌ హీరో గోపీచంద్ నటించిన చివరి రెండు మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో తనకు గతంలో లక్ష్యం, లౌక్యం వంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో జతకట్టాడు గోపీచంద్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన రామబాణం చిత్రంతో మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

Advertisement

డింపుల్ హయాతి కథానాయికగా నటించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తున్న ఈ రామబాణం మూవీ ట్రైలర్ను రాజమండ్రిలో రిలీజ్ చేశారు. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు… నేను ప్లాన్ చేసింది కాదు అనే గోపీచంద్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ను ఓ యూట్యూబర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. లీడ్ రోల్స్ మధ్య కొన్ని రొమాన్స్ కూడా ట్రైలర్ లో చూపించారు.

Advertisement

read also : IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!

Rama Banam Trailer Talk: All About Food And Family

అక్కడి నుంచి కథను మెల్లగా మెయిన్ సబ్జెక్టులోకి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలే మనిషిని కాపాడతాయంటూ సీన్లోకి జగపతిబాబు ఎంటర్ అవుతారు. రసాయనాలు లేని పంటల కోసం అతడు పోరాడుతూ ఉంటాడు. అదే సమయంలో కథలోకి విలన్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ మొదలవుతాయి. ఎప్పటిలాగే ఇలాంటి సీన్లలో మ్యాచో స్టార్ గోపీచంద్ మెప్పించాడు. ఒకప్పుడు తల దించుకునే వాడికి మర్యాద, ఇప్పుడు చెయ్యెత్తినోడికే మర్యాద అనే ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అన్ని కమర్షియల్ హంగులు ఈ రామబాణం ట్రైలర్ లో ఉన్నాయి.

read also : Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Visitors Are Also Reading