Home » IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!

IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!

by Bunty
Ad

 

ఐపీఎల్‌ 2023 టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 27 మ్యాచ్‌ లు పూర్తి అయ్యాయి. అయితే, ఈ సారి ఐపీఎల్ పెద్దగా బజ్ లేకుండానే స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్ లో మాత్రం ఒక్కో మ్యాచ్ రంజుగా మారిపోతుంది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా జరుగుతుండటం చూస్తుంటే థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తున్నాయి.

read also : Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Advertisement

ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్… 5 మ్యాచుల్లో మూడు విజయాలతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే మహికి సీజన్ ప్రారంభానికి ముందే మోకాలికి గాయం అయింది. కానీ అదేమంతా పెద్దది కాకపోవడంతో మ్యాచులు ఆడేస్తూ వచ్చారు. కానీ అది ఇప్పుడూ సీరియస్ అయ్యిందా అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 21న సన్రైజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉంది. దీనికోసం సీఎస్కే ప్రాక్టీస్ లో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

read also : Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

Chennai Super Kings skipper Mahendra Singh dhoni 2nd wicket keeper take 100 catches in ipl during csk vs kxip match | IPL 2020: बतौर विकेटकीपर धोनी ने किया धमाल, रचा यह कीर्तिमान |

కానీ ధోని బదులు ఓపెనర్ కాన్వే వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. ఇదే ఇప్పుడు కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ మ్యాచ్ లో ధోని విశ్రాంతి తీసుకుంటాడా అనిపిస్తుంది. ఒకవేళ మరీ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా సరే రావచ్చని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ధోని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఐపిఎల్ లవర్స్ అందరూ కూడా ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

read also : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

Visitors Are Also Reading