Home » రామ్ చరణ్ ఆ విషయంలో సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కానిది..!

రామ్ చరణ్ ఆ విషయంలో సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కానిది..!

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై.. మగధీర సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్ చరణ్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ప్రధానంగా దర్శక ధీరుడు తెరకెక్కించిన మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్ చరణ్. 

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయంతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో అతని ఫాలో వర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ 12 మిలియన్స్ కి చేరుకుంది. టాలీవుడ్ అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు.

Advertisement

తెలుగు హీరోలలో అత్యధికంగా 19.9 మిలియన్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని కలిగిన హీరోగా తొలిస్థానంలో ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ 17.8 మిలియన్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలోనే రామ్ చరణ్ వీరి రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. రామ్ చరణ్ ఇటీవలే తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.  ఈ వార్త తెలిసిన అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

Also Read :   రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే..?

Visitors Are Also Reading