Telugu News » Blog » రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే..?

రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్డం ను సంపాదించుకున్నారు. అలాంటి రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన తన భార్య ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్నారు. మరి వారి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ సినిమాతో మంచి హిట్ కొట్టారు.

Advertisement

Also Read:రామలింగయ్య లేకుంటే చిరును ఎన్టీఆర్ తొక్కేసేవారా.. జరిగింది ఏంటంటే .

Advertisement

దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మగధీర సినిమా చేసి మంచి టాలెంటెడ్ హీరోగా మారిపోయారు. దీని తర్వాత కొన్ని సినిమాలు చేసిన అందులో కొన్ని హిట్ ట్ అయ్యాయి. ఇంకొన్ని ప్లాప్ అయ్యాయి. ఈ తరుణంలోనే రాజమౌళి డైరెక్షన్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవడంతో పాన్ ఇండియా స్టార్ గా మారారు రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే..

అయితే వీరిద్దరూ ఒకసారి స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ కు హాజరయ్యారట.. అక్కడే ఒకరికొకరు చూసుకొని తొలిచూపులోనే ఇష్టపడ్డారట. ఆ తర్వాత ఐదేళ్లపాటు వారి లవ్ స్టోరీని కొనసాగిస్తూ, మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి వీరి ప్రేమని ఇంట్లో వారికి చెప్పి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు ఈ జంట. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకుంటున్నారు.

Also Read:దూకుడు, 100 % లవ్ సహా యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ చేసిన సినిమాలు ఇవే…!