Home » బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!

బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!

by Bunty
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు.

READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

Advertisement

త్వరలోనే వీరు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దుబాయ్ వెకేషన్ లో ఉపాసన సీమంతం గ్రాండ్ గా జరిగింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

దీంతో ఈ వారం చివర్లో లేదా వచ్చే వారంలోగా షెడ్యూల్ ను పూర్తి చేసి సుమారు మూడు నెలల వరకు రామ్ చరణ్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొనున్నట్లు సమాచారం. తమ మొదటి సంతానం కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఉపాసనతో ఉండేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారట. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో పుట్టబోయే బిడ్డ కోసం చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Visitors Are Also Reading