Home » ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

by Bunty
Published: Last Updated on
Ad

virupaksha actress sonia singh: బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సోనియా సింగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సోనియాసింగ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులారిటీ సంపాదించిన నటి.

READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Advertisement

న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, సాఫ్ట్వేర్ సావిత్రి ఇలా సోనియా నటించిన చాలా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. యమలీల సీరియల్ తో బుల్లితెరపై మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు విరూపాక్షతో వెండితెరపై ఎంట్రీ ఇస్తుంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రంలో సోనియా ఓ కీలక పాత్ర పోషించింది. తను నటించిన వెబ్ సిరీస్ లో ఎక్కువగా పవన్ సిద్ధూకు జోడిగానే కనిపించింది. ఈ ఇద్దరి జంట తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

Advertisement

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

Soniya Singh Is All Excited For Her Debut Movie 'Virupaksha' And Penned A Heartfelt Note

చాలా కాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు టాక్. సిద్ద పై తనకున్న ప్రేమని టీవీ, సోషల్ మీడియా వేదికగా బయట పెడుతుంటుంది. ఇక సోనియా సింగ్ 1998లో మార్చి 31 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటుంది. ఏ స్కూల్లో చదువుకుందో, ఏ కాలేజీలో చదువుకుందో తెలియదు గానీ బిటెక్ చదివింది. యోగా చేయడం, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం బాగా అలవాటు. అయితే చదువు పూర్త య్యాక షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం ద్వారా తన యాక్టింగ్ ప్రారంభించింది. ‘హే పిల్ల’ అనే యూట్యూబ్ ఛానల్ లో ఆడవారికి సంబంధించిన కంటెంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యింది.

read also : IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!

Visitors Are Also Reading