Home » ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..జగనన్న గోరుముద్దలో అదనంగా రాగిజావ!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..జగనన్న గోరుముద్దలో అదనంగా రాగిజావ!

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా రకాల సంక్షేమ పథకాలు, స్కీమ్ లను ప్రవేశపెట్టి అద్భుతంగా ముందుకు సాగుతోంది. అలాంటి పథకాలలో ఒకటి జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. బడి ఈడు పిల్లల్లో ఎన్ రోల్మెంట్ ను పెంచడంతోపాటు వారిలో ధారణ సామర్థ్యం మెరుగుపరిచి, డ్రాపౌట్స్ ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూల్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పతకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో, 37,63,698 విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది.

Advertisement

Advertisement

ఈ పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తుంది. రోజువారి అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లిచిక్కి ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లి చక్కని ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

New Mid-Day-Meal menu on board under Jagananna Gorumuddha scheme in Andhra- The New Indian Express

ఫలితంగా మధ్యాహ్న భోజనంలో చిక్కి ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగి జావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజులపాటు రాగి జావను మిడ్ డే మీల్స్ లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మీల్స్ లో పిల్లలకు రాగి జావా అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది.

READ ALSO : Hunt : రేపే ‘హంట్’ స్ట్రీమింగ్… విడుదలైన 15 రోజులకే ఓటీటీకి సుధీర్ బాబు సినిమా

Visitors Are Also Reading