Home » Hunt : రేపే ‘హంట్’ స్ట్రీమింగ్… విడుదలైన 15 రోజులకే ఓటీటీకి సుధీర్ బాబు సినిమా

Hunt : రేపే ‘హంట్’ స్ట్రీమింగ్… విడుదలైన 15 రోజులకే ఓటీటీకి సుధీర్ బాబు సినిమా

by Bunty
Ad

సుధీర్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హంట్. గన్స్ డోంట్ లై అనేది క్యాప్షన్. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి మహేష్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. స్టోరీ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా బోల్తా కొట్టింది. దీంతో ఈ మూవీ రెండు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తోంది.

Advertisement

ఎలాంటి ప్రమోషన్, ముందస్తు హడావుడి లేకుండానే హంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అది కూడా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఫిబ్రవరి 10 ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఈ మేరకు ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అధికారికంగా ప్రకటించాయి. ముంబై పోలీస్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ గా హంట్ వచ్చింది. తన స్నేహితుడు ఆర్యన్ దేవ్ మర్డర్ కేసు డీల్ చేస్తున్న టైమ్ లో ఓ యాక్సిడెంట్ కు గురై గతం మరిచిపోతాడు. మర్డర్ మిస్టరీ మొత్తం కనిపెట్టిన టైమ్ లో మెమొరీ లాస్ అవ్వడంతో, ఆ కేసును మళ్ళీ రీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలాంటి టైమ్ లో అర్జున్ కు ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే కాన్సెప్ట్ తో హంట్ చిత్రం తెరకెక్కింది.

read also : Kalyanam Kamaneeyam : ఓటిటిలోకి ‘కళ్యాణం కమనీయం’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading