Telugu News » Blog » ఆయన వల్లే ఇల్లు కొనుక్కున్న అంటున్న రచ్చ రవి..!!

ఆయన వల్లే ఇల్లు కొనుక్కున్న అంటున్న రచ్చ రవి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

జబర్దస్త్ ప్లాట్ ఫామ్ అనేది ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్లకు మంచి వేదిక అయింది. ఈ ప్లాట్ఫారం ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా సినిమాలో రాణించ గలుగుతున్నారు. అలాంటి వారిలో రచ్చ రవి కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రచ్చ రవి.. తర్వాత జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగారు. అలా కొన్ని ఏళ్ల పాటు జబర్దస్త్ లో అలరించిన ఆయన చివరికి ఆ షో నుండి బయటకు వచ్చేసారు. అలాంటి రచ్చ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. జబర్దస్త్ నాకు తల్లి లాంటిది.

Advertisement

also read:ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?

Advertisement

నాకు సినిమాల్లో అవకాశాలు రావడం వల్ల అటు సినిమాలు ఇటు జబర్దస్త్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. అందుకే కష్టం ఎందుకని జబర్దస్త్ మానేశానని తెలియజేశారు. ఇదే సమయంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు తనను పిలిచి మరీ తన కామెడీని మెచ్చుకున్నారు. టీవీల్లో చాలాసార్లు ఆయన కామెడీ స్కిట్స్ చూసానని తెలియజేశారు. ఇకపోతే మాటలో మాటగా నాకు ఇల్లు కొనుక్కోవాలని ఉందని బ్రహ్మానందం గారితో చెప్పగా, ఆయన ఒక రోజు ఫోన్ చేసి ఒక ఫ్లాట్ ఉంది 5,00,000 తక్కువ అయినా పర్లేదు నేను ఇస్తాను ముందు నువ్వా ప్లాట్ కొనుక్కొ అని చెప్పారు. అయితే నాకు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం ఉండదు.

also read:సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి

ఆ డబ్బుతో నేను ఫ్లాట్ కొనుక్కున్నాను గృహప్రవేశానికి బ్రహ్మానందం గారు కూడా వచ్చి ఆశీర్వదించారు. అంత గొప్ప నటుడు చాలా సింప్లిసిటీగా మా కుటుంబంతో కలిసి ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా కుటుంబంలోని వారంతా ఆయనతో ఒక్కొక్కరిగా సెల్ఫీ దిగాము అని తెలియజేశారు రవి.

Advertisement

also read:జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!