Home » సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి

సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు ఎంపికై అవార్డు సాధించింది. దీంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అయితే ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాటకు మ్యూజిక్ అందించింది కీరవాణి. ఈ పాటను రాసింది చంద్రబోస్. ఇక ఈ అవార్డు రావడంతో రాజమౌళి, కీరవాణిల ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేం. కొడుకు ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయాడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త. అదే సమయంలో ఆయన నాటు నాటు పాటపై చేసిన ఘాటు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నాకు సినిమా అంటే ఫ్యాషన్. మేము నలుగురు అన్నదమ్ములం.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Advertisement

మేమంతా తుంగభద్ర ఏరియాకు వలస వెళ్లాం. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాం. ఆ ప్రాంతంలో 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమా కోసం భూమి అంతా అమ్మేశా. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా అన్న పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్, నేను కలిసి మంచి మంచి కథలు రాశాం. జానకి రాముడు, కొండవీటి సింహం ఇలా ఎన్నో హిట్ సినిమాలకు మేము పనిచేశాము. కానీ అప్పటిదాకా కీరవాణి చక్రవర్తి దగ్గర పనిచేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. కీరవాణి నా పంచప్రాణాలు. మూడో ఏట నుంచి అతడికి సంగీతం నేర్పాను.

Advertisement

READ ALSO :    NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

ఆర్ఆర్ఆర్ లో ఆ సాంగ్ చెడగొట్టారు.. కీరవాణి తండ్రి సంచలన వ్యాఖ్యలు | mm keeravani father shivashaktidatta shocking comments about rrr song details, mm keeravani father, shivashaktidatta ,shocking ...

తన టాలెంట్ చూసి ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాను. కానీ ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాట నాకు నచ్చలేదు. అసలు అది ఒక పాటేనా. అందులో సంగీతం ఎక్కడుంది. విధి విచిత్ర వైచిత్రమిది. కానీ ఇన్నాళ్లు అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చింది. చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో ఇదొక పాటా? కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదోక మ్యూజికేనా? ఏ మాట కామాటే, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. దానికి తారక్, చరణ్ డ్యాన్స్ మహా అద్భుతం. వీళ్ళ కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం’ అని అన్నారు శివశక్తి దత్తా.

READ ALSO : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!

Visitors Are Also Reading