Home » బంక‌ర్‌లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ

బంక‌ర్‌లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ

by Anji
Ad

రెండు రోజులు ర‌ష్యా బ‌ల‌గాలు ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉన్నాయి. ర‌ష్యా దాడిని ఎదుర్కోలేని ఉక్రెయిన్ యుద్ధంపై చేతులెత్తేసింది. చ‌ర్చ‌ల‌కు సిద్ధం అంటూ ర‌ష్యాకు సంకేతాలు పంపుతుంది. మ‌రొక‌వైపు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రానికి ర‌ష్యా బ‌ల‌గాలు చేరుకుంటున్నాయి. అక్క‌డున్న ఉక్రెయిన్ కార్యాల‌యాల‌పై ర‌ష్యాజెండాలు ఎగుర‌వేశారు. ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్‌ను ఆక్ర‌మించేందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ దేశ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. త‌మ దేశాధ్య‌క్షుడు అయిన జెలెన్ స్కీ ని బంక‌ర్ లోకి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న‌ను కాపాడుకునేందుకు ఈ ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. దీనిపై అధికారికంగా స‌మాచారం రావాల్సి ఉన్న‌ది.

Also Read :  WWE లో హార్దిక్ పాండ్య ద‌ర్శ‌నం..? ఫోటోలు వైర‌ల్‌..!

Advertisement

Advertisement

మ‌రొక వైపు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ ప‌రిస్థితుల‌పై వీరిద్ద‌రూ మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌త విద్యార్థుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా బుకారెస్ట్ రోమేనియా దేశాల‌కు రెండు ప్ర‌త్యేక విమానాల‌ను పంపుతుంది.

 

రేపు హంగ‌రీ రాజ‌ధాని బుడాపెస్ట్‌కు ఓ విమానాన్ని పంపుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు స్వ‌దేశానికి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉండాల‌ని దారి ఖ‌ర్చుల‌కు అవ‌స‌రం అయినంత డ‌బుల్ డోస్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ను కంప‌ల్స‌రీ వెంట ఉంచుకోవాల‌ని భార‌త్ ఎంబ‌సీ సూచించింది. అదేవిధంగా విద్యార్థులు వ‌చ్చే వాహ‌నాల‌కు క‌చ్చితంగా భార‌త జెండా ఉండేలా చూసుకోవాల‌ని తెలిపింది.

Also Read :  కేటీఆర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగ లేఖ‌..!

Visitors Are Also Reading