Home » WWE లో హార్దిక్ పాండ్య ద‌ర్శ‌నం..? ఫోటోలు వైర‌ల్‌..!

WWE లో హార్దిక్ పాండ్య ద‌ర్శ‌నం..? ఫోటోలు వైర‌ల్‌..!

by Anji
Ad

భార‌త స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్య ఇప్పుడు వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లోకి ప్ర‌వేశించాడ‌ని అభిమానులు ఛ‌లోక్తులు విసురుతున్నారు. తాజాగా పాండ్యాను పోలిన ఓ రెజ్ల‌ర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డ‌మే ఇందుకు కార‌ణం. WWE NXT స్టార్ రెజ్ల‌ర్ కార్మెలో హేస్‌.. చూడ‌డానికి అచ్చం పాండ్య మాదిరిగానే ఉండ‌డం అత‌ని ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఈ విష‌యాన్ని గుర్తించిన భార‌త్‌లోని ప‌లువురు నెటిజ‌న్లు ఆ ఫొటోల‌కు త‌మ క్రియేటివిటి జోడించారు. దీంతో హార్దిక్ పాండ్య క్రికెట్ వ‌దిలేని రెజ్లింగ్‌లోకి అడుగు పెట్టాడ‌ని ఇటీవ‌ల వెంక‌టేశ్ అయ్య‌ర్ ఆట చూశాక అత‌డు క్రికెట్ వీడాడ‌ని ఇప్పుడు టీమిండియాలోకి వ‌చ్చేందుకు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడ‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ విష‌యం చివ‌రికీ కార్మెలో హేస్‌కు చేర‌డంతో ఇటీవ‌ల అత‌డు స్పందించారు. భార‌త్‌లో నా లాంటి పోలిక‌లు ఉన్న హార్దిక్ పాండ్య ట్రెండ్ అవుతున్నాడంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండ‌గా.. హార్దిక్ గ‌త ఏడాది టీ-20 ప్ర‌పంచ క‌ప్‌లో విఫ‌ల‌మ‌య్యాక టీమిండియాకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌రొక‌వైపు అత‌డు రాబోయే ఐపీఎల్ మెగా ఈవెంట్‌పైనా దృష్టి సారించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వహ‌రిస్తున్నాడు. దీంతో ఈ మెగా ఈవెంట్ లో ఆ జ‌ట్టును ఎలా న‌డిపిస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.

Also Read :  పుష్ప సినిమా లో రష్మిక ఫ్రెండ్ గా నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading