Home » ఫస్ట్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన ప్రశాంత్.. శివాజీ మాట నిలబెట్టాడు..!

ఫస్ట్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన ప్రశాంత్.. శివాజీ మాట నిలబెట్టాడు..!

by Anji
Ad

సాధారణంగా ఎవ్వరైనా ఏ విషయంలోనైనా మాటలు చాలా మాట్లాడుతుంటారు. కానీ చేతల్లో చేసి చూపిస్తా అనడం కాదు.. చేసి చూపించాడు ప్రశాంత్.అతని సత్తాను ముందు చూసింది శివాజీనే. అందుకే శివాజీ ఫస్ట్ నుంచి ప్రశాంత్ కు మద్దతు ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా తన లెటర్ ను కూడా త్యాగం చేసి ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ నించి తప్పుకున్నాడు శివాజీ. ప్రశాంత్ కు ఛాన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ కోసం త్యాగం చేసినా ప్రశాంత్ ఆ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు. టాస్క్ లో తన సత్తా చాటాడు. మొదటి కెప్టెన్ అయి స్టార్ మా బ్యాచ్ కు షాక్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ముఖ్యంగా అమర్ దీప్ అయితే.. ప్రశాంత్ మొదటి కెప్టెన్ అవ్వడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. అమర్ దీప్, సందీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ అయితే అస్సలు తట్టుకోలేకపోయారు. వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. టీషర్ట్స్ మీద కలర్స్ కొట్టుకోవాలని, బర్జర్ మోగే లోపు ఎవరి టీషర్ట్ మీద తక్కువ రంగులు ఉంటాయో వాళ్లే ఈ టాస్క్ లో విన్ అయినట్టు అని ప్రియాంకను సంచాలక్ గా నియమిస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్ లోనే తేజ అవుట్ అవుతాడు. ఆ తర్వాత రెండో రౌండ్ లో మాస్టర్ బయటికి వెళ్లిపోతాడు. ఇక మూడో రౌండ్ లో ప్రశాంత్, గౌతమ్ ఇద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. ఇద్దరు ఏమాత్రం తగ్గరు. ప్రశాంత్ అయితే చిరుతల దూకుతాడు. చిరుతలా గౌతమ్ మీద దూకి ఎక్కడికక్కడ కట్టడి చేస్తాడు. బర్జర్ మోగే వరకు తనలో ఉన్న కసిని ప్రతి ఒక్క పేక్షకుడు చూశాడు. ఆ కసితోనే శివాజీ మాట నిలబెడతాడు ప్రశాంత్. చివరకు మొదటి కెప్టెన్ అని చరిత్ర సృష్టిస్తాడు.

ప్రశాంత్ ఆట ఆడటం చూస్తుంటే కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనిపిస్తోంది. శివాజీ మద్దతులో ప్రశాంత చాలా బాగా ఆడుతున్నాడు. ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకుంటున్నాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే టాప్ 5 లో శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్ కచ్చితంగా ఉంటారు అనిపిస్తోంది. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లారిటీ రావడం లేదు. చాలామంది అమర్ దీప్ అంటున్నారు. మరికొందరు తేజ, ప్రియాంకలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు.  ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది వేచి చూడాలి మరీ. 

 

Visitors Are Also Reading