Home » జిమ్ములో ప్రగ్యా జైస్వాల్ కసరత్తులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

జిమ్ములో ప్రగ్యా జైస్వాల్ కసరత్తులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

by Anji
Ad

ఉత్తరాదికి చెందిన అందాల తార ప్ర‌గ్యాజైస్వాల్‌. కంచె, జ‌య‌జయ‌జానక, మిర్చిలాంటి కుర్రోడు వంటి సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవ‌ల నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన అఖండ సినిమాలో మెరిసింది. ఈ అమ్మ‌డు కెరీర్ ప్రారంభం నుంచే గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను పోషిస్తూనే ఉంది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ పాత్ర‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఓ వైపు పాత్ర‌ల‌ను పోషిస్తూనే మ‌రోవైపు గ్లామ‌ర్ కూడా ఒల‌క‌బోస్తుంది ఈ బ్యూటీ. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఫోటోలు, వీడియోల‌తో కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంది.


ప్ర‌స్తుతం హీరోయిన్ల‌కు ఎవ‌రికైనా వ‌ర్కౌట్లు ఎంతో అవ‌స‌రం. ఇక వ‌ర్కౌట్ చేయ‌క‌పోతే వారికి నాజూకైన న‌డుము అస‌లు క‌నిపించ‌దు. దీని ద్వారా గ్లామ‌ర్ లో విష‌యంలో వారు వెనుక‌బ‌డిపోతార‌నే చెప్ప‌వ‌చ్చు. అందుకే హీరోయిన్లు ఎక్కువ‌గా వ‌ర్కౌట్లకు ప్రాధ‌న్య‌త ఇస్తారు. బోల్డ్ బ్యూటీ ప్ర‌గ్యాజైస్వాల్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. అందంతో కుర్ర‌కారును క‌ట్టిప‌డేసే ఈ చిన్న‌ది తాజాగా జిమ్‌లో చెమ‌టోడ్చిన వీడియోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ప్ర‌గ్యాజైస్వాల్ అందం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Advertisement

 

వావ్‌.. నైస్ బ్యూటీ అంటూ ప‌లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి ల‌క్ష‌ల‌లో లైకులు, కామెంట్లు వ‌స్తున్నాయి. ఇక ప్ర‌గ్యాకు ఎక్కువ‌గా ఆఫ‌ర్లు లేక‌పోయినా కానీ అందాల ఆర‌బోత‌ను మాత్రం ఈ చిన్న‌ది ఆప‌డం లేదు. సీనియ‌ర్లా, జూనియ‌ర్లా, స్టార్ హీరోలా అనే తేడా లేకుండా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ల‌న్నింటిని వినియోగించుకుంటుంది. అందం, అభిన‌యంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కానీ ఈ బ్యూటీ మాత్రం స్టార్ రేసులో ఎందుకో వెనుక‌బ‌డిపోయింది. అయినా స‌రే త‌న అందాల‌ను మాత్రం ఆర‌బోస్తూ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌గ్యాజైస్వాల్ జిమ్ములో క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : 

అన‌సూయ ఒక్క షోకు రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా…? ఆ ముద్దుగుమ్మ అందరికంటే గ్రేట్…!

 

Visitors Are Also Reading