Home » టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా…? ఆ ముద్దుగుమ్మ అందరికంటే గ్రేట్…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా…? ఆ ముద్దుగుమ్మ అందరికంటే గ్రేట్…!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కేవలం అందం లోనే కాదు తెలివిలోనూ మాములోల్లు కాదు. ఓవైపు సినిమా లు చేస్తూనే మరోవైపు చదువు పూర్తి చేశారు. అంతే కాకుండా కొందరు భామలు ఉన్నత చదువులు చదవడం గొప్ప విషయం. ఇక టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఎంత చదువుకుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

SAIPALLAVI

Advertisement

క్వాలిఫికేషన్ గురించి చెప్పుకునే ముందుగా సాయి పల్లవి గురించి చెప్పాలి. నెమలి లా నాట్యం చేసే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కేవలం నటన నాట్యం లోనే కాదు చదువులోనూ సాయి పల్లవి చాలా చురుకు. ఈ భామ ఎంబిబిఎస్ పూర్తి చేసింది..

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత బి కామ్ డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే సినిమాలలో ట్రై చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది.

కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ తన అందం తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బీఎస్సీ సైకాలజీ చదువుకుంది.

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మీక పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ జర్నలిజం , సైకాలజీ లో డిగ్రీ పూర్తి చేసింది.

Nayanatara Vignesh shivan

Nayanatara

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అటు తమిళ్ ఇటు తెలుగు లో ఫుల్ బిజీగా ఉంది. నయనతార బి ఎ లిటరేచర్ చదువుకుంది.

బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. ఈ అమ్మడి డేట్స్ కోసం డైరెక్టర్ లు క్యు కడుతున్నారు. పూజ హెగ్డే ఎం కామ్ చదువుకుంది.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా లో పట్టా అందుకుంది.

Visitors Are Also Reading