Home » అన‌సూయ ఒక్క షోకు రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

అన‌సూయ ఒక్క షోకు రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

by Anji

టాలీవుడ్ న‌టి, బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఇటీవ‌ల అసూయ 37న జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కూడా జ‌రుపుకున్నారు. ఆమెకు సెలెబ్రిటీస్తో పాటు సామాన్య నెటిజ‌న్లు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పుట్టిన రోజుసంద‌ర్భంగా అనసూయ కొన్ని ఫోటోల‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అన‌సూయ తెలుగులో టాప్ యాంకర్స్ ల‌లో ఒక‌రుగా రాణిస్తున్నారు. ఆమె పర్స‌న‌ల్ విష‌యానికొస్తే.. అన‌సూయ 2008లో భద్రుక క‌ళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేసారు.

ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్‌.ఆర్‌. ఎగ్జిక్యూటివ్ గా కూడా ప‌ని చేసారు. ఆ త‌రువాత కొద్ది రోజుల త‌రువాత తెలుగు న్యూస్ ఛాన‌ల్ సాక్షిటీవీలో టెలివిజ‌న్ వ్యాఖ్యాతగా ప‌ని చేసారు.ఇక ఆ త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో యాంక‌ర్‌గా తెలుగు టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కు పరిచ‌య‌మ‌య్యారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారానే ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. అన‌సూయ అందాల ఆర‌బోత కూడా జ‌బ‌ర్ద‌స్త్ షోను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అక్కినేని నాగార్జున న‌టించిన సొగ్గాడే చిన్నినాయ‌న మూవీ నుండి సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరుస్తూ వ‌స్తోంది. గ్లామ‌ర్ షోలోనూ వెనుకాడ‌కుండా వెండితెర‌పై క‌నిపించేందుకు వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకుంటుంది.

విన్న‌ర్‌, ఎఫ్‌.2 చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాల్లో కొన్ని స్పెష‌ల్ సాంగ్స్‌లోనూ న‌టించి మెప్పించింది. పుష్ప‌లోనూ దాక్షాయ‌ణిగా మెప్పించింది అన‌సూయ‌. తెలుగు టాప్ యాంక‌ర్‌ల‌లో ఒక‌రుగా కొన‌సాగుతున్న అన‌సూయ ఒక్కో షోకు రూ.2ల‌క్ష‌ల నుండి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటార‌ట‌. ఇందుకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ విష‌యంలో అధికారికంగా స‌మాచారం తెలియాల్సి ఉన్న‌ది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం ద్వారా మంచి గుర్తింపు ద‌క్కించుకున్న‌ది అన‌సూయ‌. ఇక సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమాలో న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అందులో నిజ‌మెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Also Read : 

కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

సురేఖ‌తో పెళ్లి కోసం చిరంజీవి పై నిఘాపెట్టిన తండ్రీ కొడుకులు..!

Visitors Are Also Reading