Home » LOVE TODAY MOVIE REVIEW : ఎమోషన్స్ తో యువతను మెప్పిస్తోందా ?

LOVE TODAY MOVIE REVIEW : ఎమోషన్స్ తో యువతను మెప్పిస్తోందా ?

by Anji
Ad
  • సినిమా : ల‌వ్‌టుడే
  •  నటీనటులు :  ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు.
  • ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్ 
  • సంగీతం  :  యువన్ శంకర్ రాజా
  • నిర్మాణ సంస్థ : ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్
  • తెలుగులో పంపిణీ : శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) 
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
  • విడుదల తేదీ :  నవంబర్ 25, 2022.

LOVE TODAY MOVIE Cast, Story, Crew, WIKI, Movie Review in Telugu

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ల‌వ్‌టుడే. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు డబ్ చేశారు. హిలేరియస్ గా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ల‌వ్‌టుడే ఒకటి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ల‌వ్‌టుడే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. 

Advertisement

LOVE TODAY MOVIE Story కథ :

Manam News

ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవానా) ఒకరికొకరు ఇష్టపడతారు. నికిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు వీరి ప్రేమ విషయం వేణు శాస్త్రికి తెలుస్తుంది. ప్రదీప్ ని ఇంటికి పిలిపిస్తాడు. ఏవేవో ఊహించుకుని వచ్చిన ప్రదీప్ కి వేణు శాస్త్రీ ఊహించని షాక్ ఇస్తాడు. ప్రదీప్, నికితలు ఒక రోజు వారి స్మార్ట్ ఫోన్లను మార్చుకోవాలని ఆ తరువాత రోజు అదే సమయానికి వారిద్దరూ ఒకరినొకరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు. వారిద్దరూ ఫోన్లు మార్చుకుంటారు. ఆ ఒక్క రోజులో ఏం జరిగింది ? ఒకరి ఫోన్ లో మరొకరికి నమ్మలేని సీక్రెట్స్ ఏమైనా కనిపించాయా? 24 గంటల తరువాత వారి పెళ్లి చేసుకోవాలనుకున్నారా ? అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

Also Read :  టెంపర్ క్లైమాక్స్ విని దర్శకుడు పూరి జగన్నాథ్ ఏం చేశాడో తెలుసా ?

LOVE TODAY MOVIE REVIEW in Telugu విశ్లేషణ :

LOVE TODAY MOVIE REVIEW in Telugu

నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ. ఐ లవ్ యూ అనే మాట నుంచి నాకు నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. కానీ అస్సలు ఏమి తెలీదని అర్థం అయింది. అయితే ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అనే మాటవరకు జరిగే ప్రయాణమే ల‌వ్‌టుడే . ఈ డైలాగ్ ట్రైలర్ లోనే చూపించారు. ప్రధానంగా ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్లలో తమ గురించి తమకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యాలు చాలా ఉంటాయి. అవి బయటపడితే ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. దాదాపు ప్రతీ ఒక్కరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్ ఇది. సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.  

Advertisement

Also Read :  కమల్ హాసన్ హెల్త్ పై వైద్యులు ఏమన్నారంటే ?

Love Today Manam News

హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, అది అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడానికి ప్రదీప్ అరగంట సమయం తీసుకున్నాడు. అక్కడి వరకు కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఫోన్లు మార్చుకున్న దగ్గర నుంచి కథనం పరుగులు తీస్తుంది. ఫోన్లు మార్చుకున్న తరువాత ఒకరి రహస్యాలు మరొకరికీ తెలియడం, వాటి నుంచి కలిగి ఫ్రస్టేషన్లు విపరీతమైన ఫన్ ని జనరేట్ చేస్తుంది. ఈ సన్నివేశాలు అయితే యూత్ ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ సీన్ లో ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్ రెండోసారి కలిసే సీన్ హైలెట్ అనే చెప్పాలి.  

Also Read :  మరోసారి హాట్ టాపిక్ గా చై సామ్ విడాకుల వ్యవహారం…అసలు కారణం ఇదే అంటూ నెట్టింట వైరల్…!

Love Today : Manam News

సెకండాఫ్ లో హిలేరియస్ గా సాగుతుంది. చివరి అరగంటను మాత్రం ప్రదీప్ ఎమోషన్ తో నింపేశాడు. హీరోయిన్ తో రెస్టారెంట్ లో గొడవపడే సీన్ దగ్గర నుంచి సినిమా టోన్ పూర్తిగా ఎమోషనల్ అయిపోతుంది. ప్రేక్షకులు కూడా ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. చివరి 10 నిమిషాల్లో హీరో, హీరోయిన్లు బీచ్ లో కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం సినిమాకే హైలెట్ అని చెప్పాలి. సినిమాకి మరో పెద్ద ప్లస్ యోగిబాబు పాత్ర. తన కామెడీ తో ఆకట్టుకున్నాడు. చివరి అరగంటల యోగి బాబు, ప్రదీప్ ల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ‘ఒక విషయాన్ని దాస్తున్నామంటే అది ఇతరులకు తెలియకూడదని అర్థం. అది తప్పు అవ్వాల్సిన అవసరమే లేదు’ అంటూ అర్థవంతమైన డైలాగ్ కూడా యోగిబాబుతో చెప్పించాడు ప్రదీప్.  

Also Read :  మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

Love Today tamil Movie - Overview

అక్కడక్కడ కొన్ని మైనస్ లు ఉన్నాయి. సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం ప్లస్. పిల్లా పడేశావే, ప్రాణం పోతున్నా అనే పాటలు ఆకట్టుకుంటాయి. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ చాలా అందంగా చూపించారు. ఈ చిత్రం ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో. ఒక కథకు దర్శకత్వం వహిస్తూ.. అందులో హీరోగా నటించి మెప్పించడం అంత సులువైన పని ఏం కాదు. ఇటీవల కాంతార సినిమాలో రిషబ్ శెట్టి, ల‌వ్‌టుడే తో ప్రదీప్ రంగనాథన్ దానిని చేసి చూపించారు. అదేవిధంగా కాంతార సినిమాని అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయగా.. ల‌వ్‌టుడే సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేయడం విశేషం. మొత్తానికి ల‌వ్‌టుడే సినిమా అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే సినిమా. ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఒంటరిగా వెళ్లితే అంత ఎంజాయ్ ఉండదు. నవ్విస్తూనే చివరికీ ఆలోచింపజేసే సినిమా ల‌వ్‌టుడే. 

Also Read :  తమిళ స్టార్ హీరో అజిత్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading