Telugu News » Blog » కమల్ హాసన్ హెల్త్ పై వైద్యులు ఏమన్నారంటే ?

కమల్ హాసన్ హెల్త్ పై వైద్యులు ఏమన్నారంటే ?

by Anji
Ads

స్టార్ హీరో కమల్ హాసన్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరాడు. కమల్ అస్వస్థతకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కమల్ కి శ్వాస తీసుకోవడంలోనూ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆసుపత్రిలో బుధవారం రాత్రి చేరారు కమల్ హాసన్. కమల్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

Advertisement

హెల్త్ బులిటెన్ ప్రకారం.. కమల్ హాసన్ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో నవంబర్ 23న రాత్రి ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్ కి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్యం నిలకడగాన ఉన్నదని.. రెండు రోజుల్లో కమల్ హాసన్ ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also Read :  మరోసారి హాట్ టాపిక్ గా చై సామ్ విడాకుల వ్యవహారం…అసలు కారణం ఇదే అంటూ నెట్టింట వైరల్…!

ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. చాలా రోజుల తరువాత యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవల కమల్ హాసన్ దర్శకుడు కలాతపస్వీ కే విశ్వనాథ్ ని కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియా 2లో కమల్ హాసన్  నటిస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన ఇండియన్ సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

Advertisement

Also Read :  కొరటాల శివ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యం పోవడం పక్కా..!