Home » మరోసారి హాట్ టాపిక్ గా చై సామ్ విడాకుల వ్యవహారం…అసలు కారణం ఇదే అంటూ నెట్టింట వైరల్…!

మరోసారి హాట్ టాపిక్ గా చై సామ్ విడాకుల వ్యవహారం…అసలు కారణం ఇదే అంటూ నెట్టింట వైరల్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో చాలామందికి ఫేవరెట్ కపుల్ గా మారిన నాగచైతన్య సమంత గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఏడేళ్లకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ తో సమంతకు బ్రేకప్ అయిన తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడింది.

Advertisement

ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ జంట గోవాలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం సైతం ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ పెళ్ళైన ఐదేళ్లకే ఈ జంట అభిమానులకు షాక్ ఇస్తూ విడాకులను ప్రకటించింది. విడాకుల అనంతరం చైతూ సమంత ఇద్దరూ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు.

Advertisement

అయినప్పటికీ వారి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కాగా తాజాగా సమంత నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. నాగచైతన్య చాలా నెమ్మదిగా… రిజర్వ్డ్ గా కనిపిస్తాడు అన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం చైతు యాక్టివ్ గా కూడా కనిపించడు. అయితే సమంత మాత్రం చాలా హుషారుగా అల్లరిగా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో నాగచైతన్య ఆటిట్యూడ్ నచ్చకపోవడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. అంతేకాకుండా సమంత ఫ్రెండ్స్ తో చిల్ గా గడపాలని అనుకుంటుంది. కానీ చైతూ చాలా సైలెంట్…. ఇవే కాకుండా పిల్లల విషయంలోనూ అక్కినేని ఫ్యామిలీ సమంత పై ఒత్తిడి తెచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading