Home » తమిళ స్టార్ హీరో అజిత్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడనే విషయం మీకు తెలుసా ?

తమిళ స్టార్ హీరో అజిత్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

తమిళంతో పాటు తెలుగులో కూడా అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయాలను సాధించాయి. తమిళంలో అయితే అజిత్ సినిమా విడుదలవుతుందంట అభిమానులకు పండుగే.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తుంటారు. అజిత్ తన వ్యక్తి గత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. అజిత్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

అజిత్ కి ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉందట. ఒకప్పుడు అజిత్ లవర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కోసం లేడీ ఫ్యాన్ పీచ్చెక్కి పోయేవారు. హీరోగా రాణిస్తున్న సమయంలో అజిత్ ప్రేమలో పడ్డారు. మొదటి హీరోయిన్ ని ప్రేమించారు. ఆమె మరెవ్వరో కాదు.. హీరా రాజగోపాల్. అప్పట్లో వీరి ప్రేమ కథ పెద్ద సంచలనమే అయింది. చాలా కాలం పాటు వీరు ప్రేమించుకున్నారు.  ఒకరి కోసం మరొకరు ప్రేమ లేఖలు కూడా రాసుకున్నారు. అజిత్, హీరాలు కాదల్ కొట్టై అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 

Advertisement

Also Read :  కమల్ హాసన్ హెల్త్ పై వైద్యులు ఏమన్నారంటే ?

 

 

అప్పట్లో నటుడు బయిల్వాన్ రంగనాథన్ వీరి ప్రేమ కథను చెప్పడంతో బయట ప్రపంచానికి వీరి లవ్ స్టోరీ గురించి తెలిసింది. అజిత్ రాసిన ప్రేమ లేఖలు కూడా అతడు చదివాడు అని తెలిపాడు. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని అనుకునే లోపే హీరా రాజగోపాల్ తల్లి వీరి ప్రేమను నిరాకరించింది. ఎట్టి పరిస్థితిలో వీరి పెళ్లి పెళ్లికి ఒప్పుకునేది లేదని ఆమె చెప్పడంతో ఈ జంట విడిపోయింది. ఇక ఆ తరువాత అజిత్ హీరోయిన్ షాలినితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. వీరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. తన మొదటి లవ్ ఫెయిల్యూర్ బాధలో నుంచి బయటపడడానికి షాలినీ ప్రేమ తోడు అయింది. ఇప్పుడు అజిత్ ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. 

Also Read :  కొరటాల శివ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యం పోవడం పక్కా..!

Visitors Are Also Reading