Home » మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

by Anji
Ad

ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఫిఫా వరల్డ్ కప్ పైనే ఉంది. ఖతార్ వేదికగా సాకర్ ప్రపంచ కప్ మ్యాచ్ లు హోరా హీరీగా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ ప్రాతినిథ్యం లేకున్నా భారత్ లోనూ ఫిఫా ప్రపంచకప్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ అభిమానాన్ని విభిన్న రీతిలో చాటుకుంటున్నారు. ఈఆటను అభిమానించే వారిలో సినిమా తారలున్నారు. పైన ఉన్న ఫోటో కూడా అలాంటిదే కావడం విశేషం. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి మురిసిపోతుంది ఓ స్టార్ హీరోయిన్.

Advertisement

తనదైన అందం, అభినయంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫీమెల్ ఓరియంటేడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అదే సమయంలో గ్లామర్ రోల్స్ తో మెప్పించింది. తన అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపుగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ? ఈమె మరెవ్వరో కాదండోయ్.. మహానటి కీర్తి సురేష్. ఇది పాత ఫోటో అయినా ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కీర్తి అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Also Read :   తమిళ స్టార్ హీరో అజిత్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడనే విషయం మీకు తెలుసా ?

మెస్సీ అన్నా అర్జెంటీనా జట్టు అన్నా కీర్తికి ఎంతో అభిమానం. అయితే ఇటీవలే అర్జెంటీనాను సౌది అరేబియా ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో కీర్తిసురేష్ మెస్సిని అభిమానిస్తూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్ లు షుర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ చివరగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె నాని దసరా సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిలిగా కనిపించనుంది. వీటితో పాటు రెండు జెళ్ళ జీత, మామన్నన్, సైరన్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగానే ఉంది కీర్తి సురేష్.

Also Read :  ఫిఫా ప్రపంచ కప్ లో అతి పెద్ద సంచలనం.. 36 విజయాల రికార్డుకి చెక్..!

Visitors Are Also Reading