Home » ఆ స్టార్ హీరోయిన్‌తో ప్ర‌భాస్ ఫోన్ కాల్ లీక్‌.. ఏం మాట్లాడారో తెలుసా..?

ఆ స్టార్ హీరోయిన్‌తో ప్ర‌భాస్ ఫోన్ కాల్ లీక్‌.. ఏం మాట్లాడారో తెలుసా..?

by Anji
Ad

పాన్ ఇండియా హీరో, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఈ మ‌ధ్య క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డుపుతున్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఆయ‌న సినిమాలు ఎప్పుడు విడుద‌ల‌వుతాయోన‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వ‌చ్చినా అభిమానులు హంగామా చేస్తుంటారు. ఇక తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆయ‌న ఫోన్ కాల్‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇది కూడా చ‌ద‌వండి  :  చిరంజీవి ఇచ్చిన ఐడియాతో స్టోరీ రెడీ చేసుకున్న రైటర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలుసా ? ఏ సినిమా అంటే ?

Advertisement

కాఫీ విత్ క‌ర‌ణ్ స‌క్సెస్ ఫుల్‌గా 6 సీజ‌న్లు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ఏడో సీజ‌న్‌ని హోస్ట్ చేస్తున్న క‌ర‌ణ్‌. ముఖ్యంగా ఈ షోకి బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతుండ‌గా.. మ‌రికొంద‌రూ మాత్రం ఈ షోకి హాజ‌రు కావ‌డానికి ఆసక్తి చూపించ‌డం లేదు. హాజ‌రైన వారికి విచిత్ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌వ్వ‌డం చూసి చాలా మంది హాజ‌రు కావ‌డం లేదు. రీసెంట్ గా కాఫీ విత్ క‌ర‌ణ్ షోకి గెస్ట్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. ఇందులో ప్ర‌ధానంగా రాపిడ్ ఫెయిర్ రౌండ్‌లో ఎవ‌రైనా ఒక సెల‌బ్రెటికీ ఫోన్ చేసి.. హే క‌ర‌ణ్ ఇట్స్ మీ అని చెప్పించాల‌నే రౌండ్ ఉంటుంది. ప్ర‌స్తుతం వీరి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

హాయ్ ప్ర‌భాస్‌.. నేను క‌ర‌ణ్ షోలో ఉన్నాన‌ని చెబుతుంది కృతి. ఇక హాయ్ కృతి అంటూ న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తాడు ప్ర‌భాస్‌. వెంట‌నే క‌ర‌ణ్ జోహార్ వ‌చ్చి హేయ్ ప్ర‌భాస్ నేను క‌ర‌ణ్ జోహార్ అని చెబుతాడు. హేయ్ క‌ర‌న్ ఇట్స్ మీ చెప్పు అని పేర్కొంటాడు. ప్ర‌భాస్ మొహ‌మాట‌ప‌డుతూ హేయ్ క‌ర‌న్ ఇట్స్ మీ ప్ర‌భాస్ అంటాడు. వ‌న్ అండ్ ఓన్లీ బాహుబ‌లి ప్ర‌భాస్‌.. కృతి స‌న‌న్ కి రెండు పాయింట్లు సంపాదించాడు అని కర‌ణ్ చెబుతాడు. త‌రువాత కృతి మాట్లాడుతూ ప్ర‌భాస్ నీకు మ‌ళ్లీ కాల్ చేస్తాన‌ని చెబుతుంది. మ‌రోవైపు టైగ‌ర్ ష్రాఫ్ మాత్రం తాను చేసిన సెలెబ్రిటీ ఫోన్ లిప్ట్ చేయ‌క‌పోవ‌డంతో తెల్ల‌మొహం వేసుకుని చూస్తుంటాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  బాలయ్య ఆ బ్లాక్ బస్టర్ సినిమా కోసం.. చిరు ఏకంగా ఒక యాడ్ లో నటించారు.. ఏంటది..!!

 

Visitors Are Also Reading