Home » బాలయ్య ఆ బ్లాక్ బస్టర్ సినిమా కోసం.. చిరు ఏకంగా ఒక యాడ్ లో నటించారు.. ఏంటది..!!

బాలయ్య ఆ బ్లాక్ బస్టర్ సినిమా కోసం.. చిరు ఏకంగా ఒక యాడ్ లో నటించారు.. ఏంటది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఎవరి ఇంట్లో ఏం జరిగిన ఒకరికొకరు హాజరవుతూ ఉంటారు. వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ మధ్య మంచి పోటీ ఉండేది. తాజాగా మూడేళ్ల క్రితం గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో ఇద్దరు మళ్లీ పోటీ పడ్డారు. ఇలా సినిమాల పరంగా పోటీ ఎంత ఉన్నా కానీ వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులు. బాలకృష్ణ 100 రోజులు ఆడిన మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఓపెనింగ్ కు బాలకృష్ణ చిరంజీవిని స్వయంగా ఆహ్వానించాడు.

Advertisement

ALSO READ;కోట్ల రూపాయలు సంపాదించి 5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ విలన్ చివరికి తినడానికి కూడా తిండి లేని స్థితిలో చనిపోయాడా ?

Advertisement

కానీ వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించిన సందర్భం అయితే లేదు. ఇద్దరూ కలిసి నటించకపోయినా ఒకరి సినిమాకు మరొకరు సహకారం అందిస్తున్నారు. ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవి ప్రమోట్ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. అది ఏంటంటే ఆదిత్య369 .. ఈ మూవీలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలు మరియు కృష్ణ కుమార్ గా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిసిటీ కోసం మూవీ నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ దూరదర్శన్ లో ఒక ప్రకటన వేయాలని ఆలోచించారు.

ఆదిత్య 369 ప్రచారం చేస్తే బాగుంటుందని భావించి, వెంటనే చిరంజీవి ని సంప్రదించి ఒక్కమాట అడిగారు. దీంతో చిరు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసారు. ఈ విధంగా ఆదిత్య 369 చిత్రం యాడ్ లో నటించి సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. ఇది అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఎక్కువమంది అభిమానులను సినిమా థియేటర్ల వైపు నడిపించేలా చేసిందని చెప్పవచ్చు. ఇలా ఆయనతో కలిసి నటించక పోయినా ఆయన సినిమా కోసం ఫస్ట్ టైం యాడ్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

ALSO READ;తండ్రి హ‌రికృష్ణ జ‌యంతి రోజున ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్‌..!

Visitors Are Also Reading