Home » చిరంజీవి ఇచ్చిన ఐడియాతో స్టోరీ రెడీ చేసుకున్న రైటర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలుసా ? ఏ సినిమా అంటే ?

చిరంజీవి ఇచ్చిన ఐడియాతో స్టోరీ రెడీ చేసుకున్న రైటర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలుసా ? ఏ సినిమా అంటే ?

by AJAY

న‌టసింహం నంద‌మూరి బాల‌య్య‌, మెగాస్టార్ చిరంజీవి వీరిద్ద‌రూ టాలీవుడ్ కు రెండు కండ్ల‌లాంటి వాళ్లు. ఇద్ద‌రి కెరీర్ లోనూ ఎన్నో బ్లాక్ బస్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. బాల‌య్య అంటే ఊర‌మాస్ అయితే చిరంజీవి అంటే బెస్ట్ డ్యాన్స్ లు..ఇద్ద‌రూ కూడా అన్ని ర‌కాల పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డ‌మే కాకుండా కొత్త‌ద‌నంతో కూడా క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు చేశారు.

chiranjeevi and pawan kalyan

chiranjeevi and pawan kalyan

ఇక చిరంజీవి త‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించాడు. ఖైదీ, గ్యాంగ్ లీడ‌ర్, ప‌సివాడి ప్రాణం, అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ నటించిన అన్ని సినిమాల‌లో బాల‌య్య కు ఒక సినిమా అంటే మాత్రం చాలా ఇష్ట‌మ‌ట‌. నిజానికి ఒక హీరో సినిమా న‌చ్చిందని మ‌రో హీరో చెప్ప‌డం అరుదు.

కానీ బాల‌య్య అలాంటి వారు కాదు. ఆయ‌న‌ది ముక్కుసూటి తత్వం. న‌చ్చితే నచ్చింద‌ని లేదంటే న‌చ్చ‌లేద‌ని చెబుతుంటారు. ఇక చిరంజీవి న‌టించిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి అంటే బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. క‌థ‌ను జంద్యాల అందించారు.

సోషియో ఫాంట‌సి చిత్రంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. లెజెండ‌రీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా సినిమాకు స్వరాలు స‌మ‌కూర్చారు. చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా చెప్పుకొదగ్గ విష‌యాలు ఉన్నాయి. ఈ సినిమా అప్ప‌ట్లో రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీ లో వ‌స్తే మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు.

Visitors Are Also Reading