Home » రీమేక్ మూవీస్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా ?

రీమేక్ మూవీస్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్  సినిమా ట్రోల్స్ ని మెగా ఫ్యామిలీ ఎదుర్కొంటుంది అనే విషయం తెలిసిందే. ఇక అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వీరిద్దరూ  గత రెండేళ్లుగా రీమేక్ ల మూవీస్ ఎక్కువగా  చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ రెండు సినిమాలతో మంచి హిట్ కొట్టినా, ఈ ఇయర్ వచ్చిన బ్రో మూవీ ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. 

Advertisement

ఇకపోతే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీ కూడా  రీమేక్ కావడం గమనార్హం.  ఇక ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గాడ్ ఫాదర్  మూవీ కూడా రీమేక్ మూవీనే.. ఇప్పుడు భోళా శంకర్ అనే రీమేక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఇక తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రీమేక్ సినిమా లపై  మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకి అందివ్వడంలో తప్పు లేదన్నారు. అది ఇతర భాషలో వచ్చిన సినిమా అయినా, కాన్సెప్ట్ బాగుంటే రీమేక్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. 

Advertisement

కొంతమంది అన్నట్టు ఈ మధ్య కాలంలో ఓటీటీ, సోషల్ మీడియాలో రావడంతో వేరే భాషల సినిమాలు కూడా ముందే చూసేస్తున్నారు. అందువల్ల ఈ భోళా శంకర్ రీమేక్ అవసరమా ? అంటున్నారు. అయితే దీని ఒరిజినల్ ‘వేదాళం’ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా  అందుబాటులో లేదనే విషయం తెలిసిన తరువాతనే  ఈ చిత్రాన్ని రీమేక్ చేశామని చిరంజీవి తెలిపారు. భోళా శంకర్ రీమేక్ కి ఒరిజినల్ కి సంబంధం లేకుండా చాలా మార్పులు చేసి తీశామని..  ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు మెగాస్టార్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మెగా బ్రదర్స్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

కూతురు లాంటి కీర్తీ సురేష్ తో ఆ చిలిపి పనులు ఏంటి ? – చిరుపై శ్రీ రెడ్డి ఫైర్

Visitors Are Also Reading