Home » “పొన్నియన్ సెల్వన్ 2” విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

“పొన్నియన్ సెల్వన్ 2” విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

by Anji
Ad

ప్రస్తుతం అగ్ర హీరోల నుంచి వస్తున్న ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. అభిమానులు కూడా పాన్ ఇండియా సినిమాల‌పైనే ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. పాన్ ఇండియా మూవీల‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్ ఒక‌టి. ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌పైకి తీసుకొచ్చారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచింది.

Advertisement

పాన్ ఇండియా మూవీగా ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్, మ‌ద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.460 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 త‌మిళంలో ఈ ఏడాది అత్య‌ధికంగా వ‌సూలు చేసిన చిత్రంగా నిలిచింది. చియాన్ విక్ర‌మ్‌, కార్తీ, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష‌, జ‌యంర‌వి, శోభిత వంటి న‌టీన‌టులు న‌టించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. పొన్నియ‌న్ సెల్వ‌న్ విడుద‌లై రెండు నెల‌లు గ‌డ‌వ‌క ముందే పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 గురించి వార్త‌లు మొద‌లయ్యాయి. ఏకంగా ఈ సినిమా విడుద‌ల తేదీ గురించి ప‌లు క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Also Read :  “ప్రేమి విశ్వనాథ్” భర్త ఎవరో తెలుసా.. ఆయన కూడా చాలా ఫేమస్..!!

ఈ నేప‌థ్యంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 విడుద‌ల అనేది పార్ట్ 1 విడుద‌లైన 6 నెల‌ల‌కు ఉంటుంద‌ని ప్ర‌మోష‌న్‌ల స‌మ‌యంలో చిత్ర‌బృందం తెలిపింది. దాని ప్ర‌కారం.. పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 2023 ఏప్రిల్ 28న ప్లాన్ చేస్తున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇందులో వాస్త‌వం ఎంత వ‌ర‌కు ఉంద‌నేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. టాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పొన్నియన్ సెల్వ‌న్ 1 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. పొన్నియ‌న్ సెల్వ‌న్ ఎప్పుడు వ‌స్తుందో వేచి చూడాలి మ‌రి.

Also Read :  ఎన్టీఆర్ కొర‌టాల సినిమా క‌థ లీక్…? ఈ చిత్రంలో హైలెట్ అదేన‌ట‌..!

Visitors Are Also Reading