Home » “ప్రేమి విశ్వనాథ్” భర్త ఎవరో తెలుసా.. ఆయన కూడా చాలా ఫేమస్..!!

“ప్రేమి విశ్వనాథ్” భర్త ఎవరో తెలుసా.. ఆయన కూడా చాలా ఫేమస్..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

karthika Deepam: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర సీరియల్స్ లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న సీరియల్ ఏదైనా ఉందంటే అదే కార్తీకదీపం.. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఈ సీరియల్ వస్తుంది అంటే అన్ని పనులను పక్కనపెట్టి దీన్ని వీక్షించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన “కరుతముత్తు” అనే సీరియల్ రీమెకే ఈ కార్తీకదీపం.

karthika Deepam  Serial Fame “premi Viswanath’ Family, Husband Name, Photos, Images

Premi viswanath Husband

Premi viswanath Husband

ఈ సీరియల్ తో కేరళలో కూడా బాగా పాపులర్ అయిన నటి ప్రేమి విశ్వనాథ్.. అదేనండి మీ వంటలక్క.. ఈ రీమేక్ సీరియల్ లో కూడా ఆమెనే తీసుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ వంటలక్కగా ఫేమస్ అయ్యింది.. అలాంటి ఈమె ఎక్కడ పుట్టింది.. భర్త ఎవరు అనే విషయాలు చూద్దాం.. 1991 డిసెంబర్ 2న కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాగా తల్లి పేరు కాంచన. లా పూర్తి చేసిన వంటలక్క ఓ ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పని చేసేది. సీరియల్స్ లోకి రాకముందే మోడల్ గా రాణించిందని తెలుస్తోంది. అంతేకాకుండా సోలో మాన్ 3d అనే ఒక సినిమాలో నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. తన సోదరుడి లాగే ఫోటోగ్రఫీ పైన ఎక్కువ మక్కువ ఉండేదట.. వంటలక్క కొన్ని పెళ్లిళ్లు శుభకార్యాలకు కూడా ఫోటోగ్రాఫర్ గా తన అన్నతో పని చేసిందట..

Advertisement

Advertisement

also read:ముద్దు సీన్ లో బాల‌య్య చేసిన ప‌నికి కెవ్వుమ‌ని అరిచిన మీనా..ఆయ‌న ఏం చేశారంటే..?

Premi viswanath Husband

Premi viswanath Husband

ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ బట్.. ఆయన ఆస్ట్రాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు.. ఈయన వద్దకు పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు, సినీ రంగానికి చెందిన వాళ్లు కూడా వస్తుంటారట. వినీత్ బట్ సూచనలతో తమ పేరులో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నారు. ప్రస్తుతం వంటలక్క కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులర్ అయి తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఆమె ఒక్క ప్రాజెక్టుపై కూడా సైన్ చేయలేదని సమాచారం.

also read:

Visitors Are Also Reading