Home » ఎన్టీఆర్ కొర‌టాల సినిమా క‌థ లీక్…? ఈ చిత్రంలో హైలెట్ అదేన‌ట‌..!

ఎన్టీఆర్ కొర‌టాల సినిమా క‌థ లీక్…? ఈ చిత్రంలో హైలెట్ అదేన‌ట‌..!

by AJAY
Ad

కొరటాల శివ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు,మిర్చి ఇలా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ను ప్రేక్షకులకు ఇస్తుంటాడు. అయితే రీసెంట్ గా కొరటాల శివ ఆచార్య సినిమాతో దారుణమైన ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా చిరు కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Advertisement

అంతేకాకుండా ఇప్పటివరకు కొరటాల తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి కానీ ఆచార్య ప్లాప్ తో ఒక్కసారిగా కొరటాలపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది. అయితే అప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

కానీ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మరో మూడు నెలలు స్క్రిప్ట్ వర్క్ జరగబోతుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కథ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

కార్పొరేట్ వైద్యం అందులో ఉండే సవాళ్లు.. దోపిడి పేదలు పడుతున్న ఇబ్బందులు ఇతర అంశాల గురించి సినిమాలో లోతుగా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. హీరో మెడికల్ మాఫియాతో ఎలా పోరాడ‌తాడు..అంత‌పెద్ద మాఫియాను ఎలా ఎదురుకుంటాడు అనేది ఈ సినిమాలో హైలైట్ గా ఉండ‌బోతుంద‌ని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading