Home » World Cup 2023 : మరోసారి పాక్ తొండాట.. లంకతో మ్యాచ్​లోనూ రిపీట్!

World Cup 2023 : మరోసారి పాక్ తొండాట.. లంకతో మ్యాచ్​లోనూ రిపీట్!

by Bunty
Ad

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక పై 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 344 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు అవలీలగా ఆ లక్ష్యాన్ని చేదించింది.

pakistan-fielders-move-boundary-line-against sl

pakistan-fielders-move-boundary-line-against sl

పాకిస్తాన్ కొత్త ఓపెనర్ అబ్దుల్లా సెంచరీ చేయగా అటు వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే నెదర్లాండ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు చీటింగ్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో బౌండరీ గేట్ కాస్త వెనక్కి జరిపారని పాకిస్తాన్ జట్టుపై ఆరోపణలు వచ్చాయి. అచ్చం శ్రీలంక జట్టుపై పాకిస్తాన్ జట్టుపై కూడా అవే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

దానికి తగ్గట్టుగానే నిన్న జరిగిన మ్యాచ్ లో బౌండరీ గేట్ కాస్త వెనక్కి జరిగి ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు తొండాట ఆడిందని… అభిమానులు ఫైర్ అవు తున్నారు. కావాలనే పాకిస్తాన్ క్రికెటర్లు బౌండరీ గేట్ ను వెనక్కి జరుపుతున్నారని… చీటింగ్ పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading