Home » Babar Azam : ఉప్పల్‌ స్టేడియం సిబ్బందికి బాబర్ అజమ్ గిఫ్ట్ !

Babar Azam : ఉప్పల్‌ స్టేడియం సిబ్బందికి బాబర్ అజమ్ గిఫ్ట్ !

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా నిన్న శ్రీలంక జట్టుపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్ మ్యాచ్లో గెలిచిన పాకిస్తాన్ జట్టు రెండవ మ్యాచ్ లో కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్ బంపర్ విజయాన్ని అందుకుంది.

Pakistan Captain Babar Azam Gifts Jersey To Hyderabad Stadium's Ground Staff

Pakistan Captain Babar Azam Gifts Jersey To Hyderabad Stadium’s Ground Staff

ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 344 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు టపటపా పడిపోయాయి. కానీ పాకిస్తాన్ ఓపెనర్ మరియు రిజ్వాన్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో శ్రీలంక జట్టుపై ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా మ్యాచ్ అనంతరం… ఉప్పల్ స్టేడియం సిబ్బందిని పాకిస్తాన్ జట్టు అభినందించింది. తమకు మంచి ఆతిథ్యం ఇచ్చారని… వారికి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్తాన్ జట్టు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్… తన జెర్సీని ఉప్పల్ స్టేడియం సిబ్బందికి ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇలాంటి సిబ్బందిని నీ తాను ఎక్కడ చూడలేదని… మాకు పాకిస్తాన్లో ఉన్నట్లే అనిపించిందని వెల్లడించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading