Home » అగ్గిపుల్ల మొనపై చిన్నదీపం.. బంగారు రేకుతో రూపొందించనున్న చిత్రకారుడు..!

అగ్గిపుల్ల మొనపై చిన్నదీపం.. బంగారు రేకుతో రూపొందించనున్న చిత్రకారుడు..!

by Anji
Ad

సాధారణంగా ప్రతీ పండుగ కలిసి మెలిసి జరుపుకుంటే ఎంతో సంతోషం ఉంటుంది. కొందరూ పండుగను తమ లైఫ్ లో గుర్తుంచుకునేవిధంగా జరుపుకుంటారు. మరికొందరూ వారి స్థోమతకు తగినట్టు జరుపుకుంటారు. ఇలా రకరకాలుగా ఎవ్వరికీ నచ్చినట్టు వారు పండుగ జరుపుకుంటారు. తాజాగా దీపావళి పండుగను కొందరూ పర్యావరణానికి హాని కలుగకుండా జరుపుకుంటే.. మరికొందరూ బాంబుల మోతతో దద్దరిల్లేట్టటు జరుపుకున్నారు. ఓ స్వర్ణకారుడు దీపావళి పండుగ సందర్బంగా అద్భుతమే తయారు చేశాడు అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

దీపావళి పండుగ సందర్భంగా అతి చిన్న దీపాన్ని పలుచని బంగారపు రేకునుపయోగించి రూపొందించాడు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ చిత్రకారుడు. అగ్గిపుల్ల మొనపై అమిరేటంత అతిచిన్న సైజ్ లో రూపుదిద్దుకున్న ఈ దీపం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీ బుగ్గకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి ఈ కళా రూపాన్ని రూపొందించాడు. దీని తయారీకి కేవలం 30 మిల్లీగ్రాముల బంగారాన్ని అనగా కేవలం రూ.200 విలువ గల బంగారం ఉపయోగించి దీనిని తయారు చేశారు. 

Advertisement

ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ లోగోను రూపొందించినట్టు చెబుతున్నాడు కొత్తపల్లి రమేష్. గతంలోనే ప్రత్యేక పర్వదినాలు, పండుగల వేళ కూడా రమేష్ సూక్ష్మ కళారూపాలను రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బంగారంతో సూక్ష్మ వరల్డ్ కప్ ను రూపొందించారు రమేష్. దీపావళి పండుగ పూట బంగారంతో రమేష్ తయారు చేసిన దీపం అందరినీ ఆకట్టుకుంటోంది. 

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!

Visitors Are Also Reading