Home » ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ విడుదల

ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ విడుదల

by Anji

ఉస్మానియా యూనివర్సిటీ  పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలు వెలువడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని బీఏ (ఓరియంటల్ లాంగ్వెజెస్) పరీక్షా తేదీలను ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కోర్సులను అనుసరించి మొదటి, మూడు, ఐదోవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేది నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.

అలాగే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ కోర్సుల రెండు, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి, ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన  తేదీల పూర్తి వివరాల కోసం  ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరిన్నీ తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading