Home » నాకు వెన్నుపోటు పొడిచారు : శ్యామల సంచలనం

నాకు వెన్నుపోటు పొడిచారు : శ్యామల సంచలనం

by Bunty
Ad

టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో పరిచయమున్న యాంకర్ శ్యామల ఇప్పటికే ఎన్నో బుల్లితెర షోలలో యాంకరింగ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి శ్యామల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా చేసి ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాదు ఆడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది.

Advertisement

ఇక గ్లామర్ యాంకర్లలో ఈమె కూడా ఒకరిని చెప్పవచ్చు. అలాంటి శ్యామల సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా తన కుటుంబం గురించి శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బాధాకర విషయం నా పెళ్ళికి మా అమ్మ హాజరు కాకపోవడమేనని పేర్కొంది. మాకు ఒక బాబు పుట్టాక రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి.

Advertisement

నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశానని చెప్పుకొచ్చింది. కానీ కోవిడ్ సమయంలో ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టడం ఎంతో బాధించింది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా చేత్తో వండి భోజనం పెట్టాను. అయినప్పటికీ మా ఫ్యామిలీని వెన్నుపోటు పొడిచి నిందలు వేసింది. నా భర్త ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు అని నాకు తెలుసు. చివరికి అదే రుజువైంది అని యాంకర్ శ్యామల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

Visitors Are Also Reading