Home » కొరటాల సినిమా వాయిదా వేయనున్న ఎన్టీఆర్..?

కొరటాల సినిమా వాయిదా వేయనున్న ఎన్టీఆర్..?

by Azhar
Ad

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా చేసిన ఎన్టీఆర్ హీరోగా.. అలాగే చిరంజీవిని హీరోగా పెట్టి ఆచార్య వంటి సూపర్ ప్లాప్ సినిమా తీసిన కొరటాల శివ కలిసి తమ తర్వాతి సినిమా చేయబోతున్నారు అనేది తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమాగా రాబోతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అనేది చేసి నెలలు దాటిపోతున్న ఇంకా షూటింగ్ అనేది మాత్రం ప్రారంభం కాలేదు.

Advertisement

గతంలో వీరి కాంబోలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ కావడంతో … ఇప్పుడు వచ్చే సినిమాపైన కూడావీరి గత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా.. భారీ అంచనాలు అనేవి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆచార్య వంటి పెద్ద ప్లాప్ తీసుకున్న కొరటాల ఈ ఎన్టీఆర్ సినిమాపైన ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నాడు అని తెలుస్తుంది. దాంతో సినిమా అనేది ఆలస్యం అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.

Advertisement

ఇక ఈ విషయంలో తాజాగా ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కొరటాల కు ఇంకా కొన్ని రోజులు సమయం ఇవ్వాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అప్పటికి కూడా కొరటాల సినిమాను ప్రారంభించలేకపోతే ఈ సినిమాను వాయిదా వేసి.. తన లైన్ లో తర్వాత ఉన్న బుచ్చిబాబుతో ముందు సినిమా తియనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా కథను బుచ్చిబాబు పూర్తిగా సిద్ధం చేసి పెట్టుకున్నాడు. కాబట్టి అది వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి :

భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్‌ ఫ్రీగా చూడండి ఇలా..!

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

Visitors Are Also Reading