Home » ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

by Azhar
Ad

ఇండియా , పాకిస్థాన్ జట్లు ఈ నెల 28న ఆసియా కప్ లో ఎదురుపడబోతున్న విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ కు ముందు ఈ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో ఆ జట్టు బౌలింగ్ అనేది వీక్ అయ్యిపోయింది. అయితే మరి షాహీన్ అఫ్రిది స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకువస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఏ బ్యాన్ బౌలర్ ను తీసుకువచ్చింది పాక్ బోర్డు.

Advertisement

అయితే ఈరోజు షాహీన్ అఫ్రిది స్థానంలో పాకిస్థాన్ జట్టులోకి మహ్మద్ హస్నైన్‌ ను తీసుకువచ్చింది. అయితే పాక్ కోసం ఇప్పటికే 18 టీ20 మ్యాచ్ లు ఆడిన మహ్మద్ హస్నైన్‌ ఓ బ్యాన్ చేయబడిన బౌలర్. అయితే ఇతను గత ఏడాది ఆస్ట్రేలియా యొక్క బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న సమయలో మహ్మద్ హస్నైన్‌ యొక్క బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదు అనే ఫిర్యాదు ఐసీసీ ముందుకు వచ్చింది.

Advertisement

దాంతో అక్కడే ఆస్ట్రేలియాలో ఐసీసీ ఆధ్వర్యంలో మహ్మద్ హస్నైన్‌ యాక్షన్ ను పరీక్షించగా.. అది ఐసీసీ నియమాలకు విరుద్ధంగా ఉంది అని.. దానిని సరి చేసుకునేవరకు అతను ఏ క్రికెట్ ఆడకూడదు అని చెప్పింది. దాంతో అప్పటి నుండి తన బౌలింగ్ యాక్షన్ పై పని చేసిన మహ్మద్ హస్నైన్‌ కు ఈ ఏడాది జూన్ లో క్లియరెన్స్ అనేది వచ్చింది. దాంతో ఇప్పుడు ఇండియాతో మ్యాచ్ ఆడబోతున్నాడు. మరి ఈ మ్యాచ్ లో అతని యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

IND VS PAK : 10 సెకండ్స్ కు ఎన్ని లక్షలు అంటే…?

21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

Visitors Are Also Reading