Home » లైగర్ ను వదిలేసిన ఎన్టీఆర్… ఎందుకు..?

లైగర్ ను వదిలేసిన ఎన్టీఆర్… ఎందుకు..?

by Azhar
Ad

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా ఈరోజే అభిమానుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అభిమానులను ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అయితే ఈ లైగర్ సినిమాను మరో టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. 2016లోనే ఈ సినిమాను ఎన్టీఆర్ తో తీయాలని పూరీ అనుకున్నాడట.

Advertisement

అప్పుడు దీనికి బాక్సర్ అనే పేరు పెట్టుకొని ఎన్టీఆర్ కు కథ అనేది చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు అనే ప్రచారం కూడా సోషల్ మీడియా వేదికగా భారీగా జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు పూరీ కథ చెప్పిన తర్వాత.. అందులో అంతగా ఏం లేదు అనే భావనకు ఎన్టీఆర్ వచ్చాడట.

Advertisement

అందుకే ఈ లైగర్ కథను అప్పుడే ఎన్టీఆర్ వదులుకున్నాడు అని తెలుస్తుంది. కానీ అదే సమయంలో వీరి కాంబినేషన్ లో టెంపర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ టెంపర్ సినిమా కథను పూరీ రాయలేదు. తాను రాయని కథకు పూరీ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే. కానీ మొదటిసారి ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా ప్లాప్ అయినా.. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఒక్క ఆఫ్ఘన్ టీం లాంటిదే…!

బంగ్లా వేదిక వుమెన్స్ ఆసియా కప్.. ఈ టోర్నీ చరిత్ర తెలుసా మీకు..?

Visitors Are Also Reading