Home » పాకిస్థాన్ ఒక్క ఆఫ్ఘన్ టీం లాంటిదే…!

పాకిస్థాన్ ఒక్క ఆఫ్ఘన్ టీం లాంటిదే…!

by Azhar
Ad

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ జట్టు యొక్క ఇజ్జత్ అనేది తీసేసాడు . అయితే ఈ నెల 27న ఆసియా కప్ 2022 టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగానే ఈ నెల 28న పాకిస్థాన్ జట్టుతో మన ఇండియా జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ పై చర్చ అనేది రెండు నెలల ముందు నుండే ప్రారంభం అయ్యింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ను రెండు దేశాల ప్రజలు చాలా ఉత్కంఠంగా చూస్తారు.

Advertisement

అందుకే ఈ మ్యాచ్ పై హైప్ కూడా చాల ఉంటుంది. అయితే ఇదే విషయంపై మాట్లాడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ జట్టు అనేది ఒక్క ఆఫ్ఘానిస్తాన్ జట్టు వంటిదే అని కామెంట్స్ చేసాడు. పాక్ తో మ్యాచ్ నేపథ్యంలో తాజాగా ఓ ఛానల్ కు రోహిత్ ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల ప్రజలు అందరూ చూస్తారు. దీనిపై చాలా హైప్ అనేది ఉంటుంది.

Advertisement

కానీ అదే హైప్ ను అలాగే దానితో పటు వచ్చే ఒత్తిడిని జట్టులో ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మొదటిసారి పాకిస్థాన్ తో ఆడేవారుకి ఇది ఒక్క మాములు మ్యాచ్ అని చెప్పాలి. వారు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పాకిస్థాన్ ఒక్క మాములు ప్రత్యర్థి చెప్పి జట్టులో మాములు పరిస్థితులు ఉండేలా చూసుకోవడం మా బాధ్యత అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

భారత్ – పాక్ మ్యాచ్ : ఆఫ్రిది చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

బంగ్లా వేదిక వుమెన్స్ ఆసియా కప్.. ఈ టోర్నీ చరిత్ర తెలుసా మీకు..?

Visitors Are Also Reading